అలియాభట్ హమ్మయ్యా అనిపించింది!
బాలీవుడ్ బ్యూటీ అలియాభట్
By: Abhi | 17 July 2023 7:12 AM GMTబాలీవుడ్ బ్యూటీ అలియాభట్ కి కుమార్తె పుట్టిన తర్వాత ఓ పిడుగులాంటి వార్త మీడియాకి వదిలిన సంగతి తెలిసిందే. ఇకపై కెరీర్ ఎలా ఉంటుందోనని...సినిమాల్లో కొనసాగుతానో? లేదో? తనకే తెలియదని..ఏ క్షణమైనా తన నుంచి ఎలాంటి నిర్ణయమైనా రావొచ్చు అన్న రీతిలో అలియా ఓ పోస్ట్ పెట్టింది. దీంతో అలియాభట్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందా? కుటుంబ జీవితానికే అంకితమైపోతుందా? అని బాలీవుడ్ మీడియాలో కథనాలు అంతకంతకు వెడెక్కించాయి.
ఉన్నపళంగా ఇలాంటి నిర్ణయం వైపు ఎలా ప్రేరిపితమవుతుంది? అసలు అలియా వెనుక ఏం జరుగుతుందో? ఒక్కసారిగా అర్ధంకాని గందరగోళం నెలకొంది. అత్తింటి కుటుంబానికి అలియా సినిమాలు చేయడం ఇష్టం లేక అలియా అలాంటి పోస్ట్ చేసిందా? అని వందరకాల సందేహాలు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా అలియా వ్యాఖ్యలతో హమ్మయ్యా అనిపించింది. అలియా పరిశ్రమ లోకి పదేళ్లు పూర్తయిన సందర్భంగా తన ప్లానింగ్ ని రివీల్ చేసింది.
'ఈ పదేళ్లలో నా జీవితంలో చాలా మార్పులొచ్చాయి. అందకు ముందు సినిమాల కోసం నిద్రమానుకుని మరీ పరుగులు పెట్టేదాన్ని. కెరీర కోసమే పూర్తి సమయం కేటాయించా. కానీ ఇప్పుడలా కాదు.
నాకంటూ ఓ కుటుంబం ఉంది. నాకో కుమార్తె వచ్చింది. భర్త ఉన్నాడు. అంతకు ముందు నా తల్లిదండ్రులతో ..సోదరితో సరైన సమయాన్ని వెచ్చించలేకపోయా. ఇప్పుడీ బాధ్యతలన్నీ పూర్తిచేయాలి.
ఇలా చెప్పినంత మాత్రాన సినిమాలు వదలేస్తానని కాదు. సినిమాలు..వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలనుకుంటున్నా. నా కోసం కూడా కోంచెం సమయం కేటాయించుకోవాలి. నాకొ శ్రేయోభిలాషి చెప్పటన్లు మనం ఎంత ప్రయత్నించినా నూటికి నూరు శాతం గొప్ప తల్లి.. గొప్ప నటి..గొప్ప కుమార్తె.. గొప్ప ప్రోఫెషనల్ కాలేం.
మనం చేయాల్సిందల్లా నిజాయితీగా ..బాధ్యతగా వ్యవహరించడమే.నేను అలాగే చేయాలనుకుంటున్నా' అని తెలిపింది. 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో అలియాభట్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అందులో సీత పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే.