Begin typing your search above and press return to search.

కూతుర్ని శాస్త్ర‌వేత్త‌ని చేస్తానంటోన్న అలియాభ‌ట్!

పిల్ల‌ల‌పై త‌ల్లిదండ్రులు ఎన్నో ఆశ‌లు పెట్టుకుంటారు

By:  Tupaki Desk   |   24 July 2023 7:08 AM GMT
కూతుర్ని శాస్త్ర‌వేత్త‌ని చేస్తానంటోన్న అలియాభ‌ట్!
X

పిల్ల‌ల‌పై త‌ల్లిదండ్రులు ఎన్నో ఆశ‌లు పెట్టుకుంటారు. కుమార్తె-కుమారుల్ని ఉన్న‌త స్థానాల్లో చూడాల‌ని క‌ల‌లు కంటారు. ఆ ర‌క‌మైన ప్ర‌ణాళిక‌తోనూ జీవితంలో ముందుకెళ్లాల‌ని చూస్తారు. త‌మ‌లాగే స‌మాజంలో మంచి పేరు తెచ్చుకోవాల‌ని మంచి..చెడులు చెబుతారు. అయితే బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ మాత్రం కుమార్తె రాహాని త‌న‌లో మాత్రం కావొద్ద‌ని చెప్పి పెంచుతుందిట‌. త‌న‌లాగే సినిమాలో రావాల‌ని గానీ... త‌న అడుగు జాడ‌ల్లో న‌డ‌వాల‌ని గాని చెప్ప‌ద‌ట‌. రాహా త‌న జీవితాన్ని ఎలా నిర్దేశించుకున్న ప‌ర్వాలేదంటోంది.

అయితే అలియాభ‌ట్ మ‌న‌సులో కోరిక మాత్రం బ‌య‌ట పెట్టింది. కుమార్తెని పెద్ద శాస్త్ర‌వేత్త‌గా చూడాల‌ను కుంటోందిట‌. గొప్ప గొప్ప ప‌రిశోధ‌నలు చేసి దేశానికి మంచి పేరు తీసుకొచ్చే కుమార్తెలా రోహాని భావిస్తుందిట‌. రాకెట్ సైన్స్ లో కుమార్తె జెమ్ లా తయార‌వ్వాలంటోంది. నిజంగా కుమార్తె విష‌యంలో అలియాభ‌ట్ డ్రీమ్ ఎంతో గొప్ప‌గా ఉంది. ఇంత‌వ‌ర‌కూ కుమార్తెల గురించి ఏత‌ల్లిని అడిగినా రోటీన్ స‌మాధాన‌లే వ‌చ్చాయి.

న‌టి అయినా ప‌ర్వాలేదు..బిజినెస్ ఉమెన్ అయినా ప‌ర్వాలేదు..ఐఏఎస్..ఐపీఎస్ లాంటి స‌మాధ‌నాలు ఎక్కువ‌గా విన్నాం. కానీ అలియాభ‌ట్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించింది. బ‌హుశా అలియాభ‌ట్ కూడా సైంటిస్ట్ అవ్వాల‌ని అనుకుని ఉంటుంది.

ఇప్పుడా కోరిక‌ను కుమార్తె రూపంలో నెర‌వేర్చుకోవాల‌ని భావిస్తోంది. మ‌రి రాహా పెద్దదైన త‌ర్వాత ఏమ‌వుతుంద‌న్న‌ది చూడాలి. అయితే అలియాభ‌ట్ కోరిక‌పై నెటి జ‌నులు స‌ర‌దాగా స్పందించారు. అవును రాహా సినిమాలో శాస్త్ర‌వేత్త అవుతుంది. అందుకు క‌ర‌ణ్ జోహార్ క‌థ‌ని సిద్దం చేసి పెడుతార‌ని ఫ‌న్నీ పోస్ట్ లు పెడుతున్నారు.

ప్ర‌స్తుతం అలియాభ‌ట్ క‌ర‌ణ్ జోహార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ క‌హానీ'లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ర‌ణ‌వీర్ సింగ్ జోడీగా అలియా క‌నిపించ‌నుంది. ఇప్ప‌టికే రిలీజ్అ యిన ప్ర‌చార చిత్రాల‌తో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ధ‌ర్మేంద్ర‌..ష‌బానా అజ్మీ.. జ‌యాబ‌చ్చ న్ లాంటి న‌టులు కీల‌క పాత్ర‌లు పోషించ‌డంతో సీనియ‌ర్ వ‌ర్గం సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. అలియాభ‌ట్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డ ఛాన్సులు వ‌స్తోన్న అమ్మ‌డు డేట్లు అడ్జ‌స్ట్ చేయ‌లేక‌పోతుంది.