Begin typing your search above and press return to search.

తొలి మ‌హిళా ఏజెంట్‌గా ఆలియా విన్యాసాలు

సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ తర్వాత YRF స్పై యూనివర్స్‌లో కొత్తగా ప్రవేశించే తార‌ అలియా భట్ అని ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించారు

By:  Tupaki Desk   |   2 Feb 2024 12:30 PM GMT
తొలి మ‌హిళా ఏజెంట్‌గా ఆలియా విన్యాసాలు
X

బాలీవుడ్ స‌హా అన్నిచోట్లా గూఢ‌చారి క‌థ‌ల హ‌వా సాగుతోంది. స్పై యూనివ‌ర్స్ క‌థ‌ల‌ను నిర్మించ‌డంలో పాపుల‌రైన వైఆర్ఎఫ్ సంస్థ త‌దుప‌రి త‌మ బ్యాన‌ర్ లో తొలి మ‌హిళా స్పై ఆఫీస‌ర్ తో క‌లిసి ప‌ని చేయ‌నుంది. సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ తర్వాత YRF స్పై యూనివర్స్‌లో కొత్తగా ప్రవేశించే తార‌ అలియా భట్ అని ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించారు. గూఢచారి ఆధారిత యాక్షన్ థ్రిల్లర్ తదుపరి అధ్యాయంలో మొదటి మహిళా ఏజెంట్ గా ఆలియా భ‌ట్ సంచ‌ల‌నాల‌కు రెడీ అవుతోంది.

ఈ చిత్రంలో శర్వరి వాఘ్ కూడా మ‌రో ఏజెంట్ గా ప్రధాన పాత్రలో కనిపిస్తుందని, ప్ర‌స్తుతానికి ఈ పాత్ర తాలూకా వివ‌రాల‌ను గోప్యంగా ఉంచార‌ని తెలిసింది. తాజా స‌మాచారం మేర‌కు దర్శకుడిని కూడా నిర్మాత ఆదిత్య చోప్రా లాక్ చేసినట్లు క‌థ‌నాలొస్తున్నాయి. శివ్ రావైల్ అలియా & శర్వరి సంయుక్తంగా దర్శకత్వం వహించే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. రైల్వే మెన్ తో ఓటీటీ రంగంలో విజ‌యం అందుకున్న శివ్ రావైల్.. ఈ సినిమాకి ప‌ని చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఆదిత్య చోప్రా - శివ రావైల్ కొంతకాలంగా త‌మ‌ అసోసియేషన్ గురించి చర్చిస్తున్నారు. ప్ర‌స్తుతానికి చ‌ర్చ‌లు సాగుతున్నాయి''అని తెలిసింది.

ఆదిత్య చోప్రాతో కలిసి రైల్వే మ్యాన్‌తో డిజిటల్ అరంగేట్రం చేయడానికి ముందు శివ్ వైఆర్ఎఫ్ సంస్థ‌ లో అనేక సినిమాల‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. చివరకు భారీ యాక్ష‌న్ సినిమా తీసేందుకు అవ‌కాశం ద‌క్కించుకున్నాడు. ఇంకా పేరు పెట్టని గూఢచారి చిత్రానికి సంబంధించిన ప్రిపరేషన్ వర్క్‌ను శివ్ ఇప్పటికే ప్రారంభించాడని, 2024 ద్వితీయార్థంలో దీన్ని సెట్స్‌పైకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది.

ఇది నిర్మాణ భాగ‌స్వాములు, వాటాదారులందరికీ ప్రతిష్టాత్మక చిత్రం. ఇప్పటికే విజ‌య‌వంత‌మైన స్పై విశ్వానికి కొత్త టేస్ట్ ని జోడించాలనే ఆలోచన ఉన్నందున గూఢచారి సాగాలో చాలా ఆశ్చర్యకరమైన విష‌యాలు ఉన్నాయి అని చెబుతున్నారు. ఈ స్పై యూనివర్స్ చిత్రంలో సూపర్ ఏజెంట్స్ గా నటిస్తున్నందున ఆలియా - శర్వరి ఇద్దరూ ఒక‌ కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి ఉత్సాహంగా ఉన్నారు.

YRF స్పై యూనివర్స్ 2012లో సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్ కాంబినేష‌న్ లో 'ఏక్ థా టైగర్‌'తో ప్రారంభమైంది. ఆ తర్వాత 2017లో టైగర్ జిందా హై, 2018లో వార్ (హృతిక్ -టైగ‌ర్), 2023లో ప‌ఠాన్ చిత్రాలు ఇందులో తెర‌కెక్కాయి. షారుఖ్ ఖాన్ - దీపికా పదుకొనేతో పఠాన్ గ‌త ఏడాది విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత‌ 2023 ముగింపులో స‌ల్మాన్-క‌త్రిన‌ల‌ టైగర్ 3 ఇదే యూనివ‌ర్శ్ లో తెర‌కెక్కింది. విశ్వంలో తదుపరి హృతిక్ రోషన్- ఎన్టీఆర్ జూనియర్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న వార్ 2 అత్యంత కీల‌క‌మైన‌ది. ఆ తర్వాత అలియా భట్ - శర్వరి చిత్రం ఈ ప్రతిష్టాత్మక విశ్వంలో ఏడవ చిత్రం కానుంది.