నాన్న కూచీని అలా క్లిక్‌మనిపించిన ఆలియా
రణబీర్ స్వయంగా రాహా చేయి పట్టుకుని ముందుకు నడుస్తుండగా.. ఆలియా ఆ క్షణాన్ని కెమెరాలో బంధించింది. దీనికి 'క్యాప్షన్ అవసరం లేదు' అని వ్యాఖ్యను జోడించింది.
By: Tupaki Desk | 18 Jun 2024 3:51 AM GMTఆలియాభట్- రణబీర్ కపూర్ జంట అన్యోన్యత, అందమైన ప్రేమైక జీవనం గురించి తెలిసిందే. ఈ జంటకు రాహా అనే క్యూట్ డాటర్ ఉంది. తన కుమార్తె రాక తనలో చాలా మార్పులు తెచ్చిందంటూ మురిసిపోయాడు రణబీర్. ఇదిగో ఇప్పుడు అరుదైన సన్నివేశం అభిమానుల కంట పడింది. రణబీర్ తన కుమార్తె చేతిని పట్టుకుని నడిపిస్తున్నాడు.. రాహా చూస్తుండగనే ఎదిగేస్తోంది. తన తండ్రి వెంటే బుడిబుడి అడుగులు వేస్తూ క్యూట్ గా కనిపిస్తోంది. రణబీర్ షార్ట్ - టీషర్ట్ ధరించి చాలా క్యాజువల్ గా కనిపిస్తుండగా, ఈ ఫోటోలో రాహా తేలికైన ఫ్రాక్‌లో క్యూట్‌గా కనిపిస్తోంది.
జాతీయ అవార్డు గెలుచుకున్న నటిగానే కాకుండా, అలియా భట్ ప్రేమగల భార్య.. చురుకైన తల్లిగా బహుముఖ పాత్రలు పోషిస్తోంది. ఆలియా షూటింగ్ సెట్లో లేనప్పుడు లేదా అంతర్జాతీయ ఈవెంట్ల కోసం ప్రయాణించనప్పుడు, ఇష్టసఖుడైన భర్త రణబీర్ కపూర్ - కుమార్తె రాహా కపూర్‌తో విలువైన సమయాన్ని గడుపుతుంది. ఫ్యామిలీ లైఫ్ లో నిజమైన ఆనందాన్ని ఆలియా అనుభవిస్తోంది. ఈ రోజు తన అధికారిక సోషల్ మీడియాలో ఈ అందమైన స్నీక్ పీక్‌ని ఆలియా షేర్ చేసింది. రాహా - డాడీ రణబీర్‌ల హార్ట్ టచింగ్ ఫోటోగ్రాఫ్ ఇది.
రణబీర్ స్వయంగా రాహా చేయి పట్టుకుని ముందుకు నడుస్తుండగా.. ఆలియా ఆ క్షణాన్ని కెమెరాలో బంధించింది. దీనికి 'క్యాప్షన్ అవసరం లేదు' అని వ్యాఖ్యను జోడించింది. ఈ ఫోటో ఈరోజే ఇంటర్నెట్‌ని గెలుచుకుంది! అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించాడు. చాలా మంది ఈ ఫోటోలకు లవ్ హార్ట్ ఈమోజీలను షేర్ చేసారు.
ఆసక్తికరంగా 'ఎడ్ ఫైండ్స్ ఎ హోమ్' అనే పేరుతో తన మొట్టమొదటి పిల్లల పుస్తకంలో అలియా రాహా కోసం షేర్ చేసిన స్వీట్ మెసేజ్ స్నాప్‌ను అభిమానుల పేజీ పోస్ట్ చేసింది. ఈ పుస్తకంలో ఆలియా ఇలా రాసింది. ''నా ఆడ శిశువుకు, రాహా.. నేను చేసే ప్రతిదీ నీ కోసమే. అది నిన్ను అవాక్కయ్యేలా చేయకపోతే, ఏం జరుగుతుందో మాకు తెలియదు''అని రాసింది. పిల్లల పెంపకంపై తల్లిదండ్రుల కోసం.. ఎడ్ ఫైండ్స్ ఎ హోమ్ రచయితగా అలియా పుస్తకాన్ని అందించింది. ఒక రచయితగా ఇది ఆలియా కీర్తి కిరీటంలో కలికితురాయి అని చెప్పాలి.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఆలియా చివరిసారిగా హార్ట్ ఆఫ్ స్టోన్ (2023)లో కనిపించింది. ఇది తన హాలీవుడ్ అరంగేట్ర చిత్రం. తదుపరి ఆలియా నిర్మిస్తున్న 'జిగ్రా'లో వేదంగ్ రైనాతో కలిసి నటిస్తుంది. రణబీర్ - విక్కీ కౌశల్‌లతో పాటు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న 'లవ్ అండ్ వార్' కూడా అలియా లైనప్‌లో ఉంది.