ఐశ్వర్యారాయ్ ఛాన్స్ తన్నుకుపోయిన అలియాభట్!
బాలీవుడ్ నటి అలియాభట్ ప్రధాన పాత్రలో ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన `హైవే` చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.
By: Tupaki Desk | 20 Aug 2024 8:30 AM GMTబాలీవుడ్ నటి అలియాభట్ ప్రధాన పాత్రలో ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన `హైవే` చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. వీరా త్రీపాఠి పాత్రలో అలియా నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఓఅమ్మాయి అపహరణకు గురైనప్పటికీ స్వేచ్ఛని వెతుక్కుంటూ ఎలా ప్రయాణిస్తుంది అనే కథాంశాన్ని ఇంతియాజ్ ఎంతో రియలిస్టిక్ గా చూపించారు. ఇందులో రణదీప్ హుడా పాత్రకు మంచి గుర్తింపు దక్కింది.
అయితే వీరా త్రిపాఠి పాత్రలో వాస్తవానికి నటించాల్సింది అలియాభట్ కాదు ఐశ్వర్యారాయ్ అన్న సంగతిని ఇంతియాజ్ రివీల్ చేసారు. ఆ పాత్రకు తొలుత 30 ఏళ్లు పైబడిన నటి అయితే బాగుంటుంద నుకున్నారు. దీనిలో భాగంగా ఐశ్వర్యారాయ్ అయితే పక్కాగా యాప్ట్ అవుతుందని, ఆమెతో ఎలాంటి మ్యాకప్ లేకుండా సినిమా పూర్తి చేయాలనుకున్నారుట. తాను తప్ప ఇంకెవ్వరూ చేయలని బలంగా నమ్మారుట.
అయితే అనుకోకుండా అలియాభట్ ని కలిసిన తర్వాత నత ఆలోచన పూర్తిగా మారిపోయిందన్నారు. భావోద్వేగాల లోతు తెలిసిన నటి అలియాలో ఉందని గ్రహించినట్లు తెలిపారు. అప్పటికే అలియా నటించిన `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్` రిలీజ్ అయింది. కానీ నేను చూడలేదు. తనని కలిసి 20-30 పేజీల కథ ఇచ్చాను. కొన్ని రోజుల వరకూ ఎలాంటి పిలుపు రాలేదు. దీంతో ఆ కథ అలియాకి నచ్చలేదనుకున్నా.
ఒకసారి అలియా దగ్గరకు వెళ్లి కథ నచ్చిందా? సినిమా చేద్దామా? అని అడిగాను. కథలో ఆమెలేని ఒక్క సన్నివేశం కూడా లేకపోవడంతో చేయగలనా? అని అలియాభట్ భయపడింది. మంచి నటన కనబరుస్తావని హామీ ఇవ్వడంతో ఒప్పుకుంది. అలా సినిమాలో ఐశ్వర్యారాయ్ స్థానంలోకి అలియాభట్ వచ్చింది` అని అన్నారు. ఈసినిమాకి ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. మ్యూజికల్ గానూ సినిమా పెద్ద సక్సెస్ అయింది.