మన సీత కి వరల్డ్ వైడ్ అరుదైన గౌరవం
దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆలియా భట్ కి మంచి ఆధరణ ఉందని తాజాగా వెళ్లడి అయ్యింది
By: Tupaki Desk | 18 April 2024 5:27 AM GMTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్‌ఆర్ఆర్ సినిమా లో రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్రలో నటించిన ఆలియా భట్ కు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ జాబితాలో ఆలియా భట్ పేరు ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు.
దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆలియా భట్ కి మంచి ఆధరణ ఉందని తాజాగా వెళ్లడి అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖల జాబితాను ప్రముఖ మ్యాగజైన్ టైమ్స్ వారు వెళ్లడించారు. టైమ్స్ 100 జాబితాలో ఆలియా భట్ నిలిచింది.
ఇండియాకు చెందిన మరికొందరు కూడా ఈ జాబితాలో నిలిచారు. కానీ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు మాత్రం ఆలియా తప్ప మరెవ్వరూ లేరు. ఆలియా కు మాత్రమే ఈ అరుదైన ఘనత దక్కింది. బాలీవుడ్ నటికి ఇంతటి గౌరవం దక్కడం అరుదైన విషయంగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హాలీవుడ్ లో గత ఏడాది హార్ట్ ఆఫ్ స్టోన్ అనే సినిమాతో మెరిసింది. అక్కడ ప్రేక్షకులను మెప్పించడం ద్వారా కూడా ఇప్పుడు టైమ్స్ 100 జాబితాలో ఆలియా చోటు దక్కించుకుని ఉంటుంది అంటూ విశ్లేషకులు మరియు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. పెళ్లి మరియు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఆలియా ఇంతగా బిజీగా ఉండటం మరియు ఇలాంటి అరుదైన గౌరవాలు దక్కించుకోవడం ఆమెకే చెల్లిందని ఫ్యాన్స్ అంటున్నారు.