ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టగలరా?
ఇది ఆలియానే అని గుర్తు పట్టడానికి సమయం తీసుకుంటుంది. పరిశీలనగా చూస్తే కానీ, గుర్తు పట్టలేనంతగా మేకోవర్ చేయడం విశేషం!
By: Tupaki Desk | 4 Jun 2024 4:53 PM GMT''నేను నిరంతరం నన్ను సవాలు చేసుకుంటూ, కొత్త తరహా పాత్రలతో ప్రతి అవకాశాన్ని ఉత్సాహంగా స్వీకరించడం ద్వారా ఆ స్పార్క్‌ను సజీవంగా ఉంచుకుంటాను'' అని అన్నారు ఆలియా భట్. సినిమా మాయాజాలం గురించి ఆసక్తిగా, ఉత్సాహంగా మాట్లాడిన ఆలియా ప్రఖ్యాత బజార్ ఇండియా కవర్ పేజీపై కిల్లర్ లుక్ తో కనిపించింది. మ్యాగజైన్ ఇంటర్వ్యూలో తన దుస్తుల బ్రాండ్ గురించి ప్రస్థావించింది. తాజాగా ఆలియా రిలీజ్ చేసిన కొత్త ఫోటోషూట్ వెబ్ లో హీట్ పెంచుతోంది. ప్రఖ్యాత బజార్ ఇండియా ఫోటోషూట్ లో ఆలియా లుక్ అమాంతం మారిపోయింది. ఇది ఆలియానే అని గుర్తు పట్టడానికి సమయం తీసుకుంటుంది. పరిశీలనగా చూస్తే కానీ, గుర్తు పట్టలేనంతగా మేకోవర్ చేయడం విశేషం!
అలియా భట్ ఫ్యాషన్ ఎంపికల్లోనే కాదు... ఈ భామ ఎంటర్ ప్రెన్యూర్ గాను రాణిస్తున్న సంగతి తెలిసిందే. 2020లో పిల్లలు, ప్రసూతి దుస్తుల బ్రాండ్ ఎడ్-ఎ-మమ్మను స్థాపించి విజయవంతమైన వ్యవస్థాపకురాలిగా ఆలియా పాపులరైంది. ఈ బ్రాండ్‌లో 51 శాతం వాటాను ఆలియా కలిగి ఉంది. ఇటీవలి ఇంటర్వ్యూలో రిలయన్స్ అంబానీలతో తన వ్యాపార భాగస్వామ్యం గురించి ఓపెనైంది ఆలియా.
జాతీయ మీడియాతో మాట్లాడుతూ ''రిలయన్స్‌తో మా జాయింట్ వెంచర్ విభిన్నమైన శ్రేణి ఉత్పత్తి వర్గాలకు విస్తరించడానికి భారీ అవకాశాలను అందించింది. వాస్తవానికి బ్రాండ్ విషయంలో మేం మా ప్రధాన విలువలకు కట్టుబడి ఉన్నాం. వారు మా మొదటి సమావేశంలోనే చాలా స్పష్టంగా చెప్పారు. థీమ్ ని నిలబెట్టడంలో రాజీకి రావొద్దు'' అని ఆలియా అన్నారు. రిలయన్స్ తో భాగస్వామ్యం కారణంగా భారతదేశంలో మా రిటైల్ ఉనికి విస్తరించింది. మేము ప్రధానంగా ఆన్‌లైన్‌లో అమ్మకాలు సాగిస్తున్నాం. కానీ మా ఉత్పత్తులు ఇప్పుడు దేశవ్యాప్తంగా 84 వేర్వేరు ప్రదేశాలలో అందుబాటులో ఉన్నాయి. ముంబయి, పూణే, బెంగళూరు, ఢిల్లీ.. అంతటా ఐదు ప్రత్యేకమైన బ్రాండ్ అవుట్‌లెట్‌లను తెరవాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. అహ్మదాబాద్‌లోని ఈ స్టాండ్‌లోన్ స్టోర్‌లు కేవలం బట్టలే కాకుండా బొమ్మలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, పుస్తకాలు, గృహోపకరణాలు సహా ఒకే గొడుగు కింద ఎడ్-ఎ-మమ్మాను విస్తరిస్తున్నాం'' ఎడ్-ఎ-మమ్మా విస్తరణ ప్రణాళికల గురించి వెల్లడించారు.
అలియా త్వరలో వేదంగ్ రైనా నటించిన 'జిగ్రా' చిత్రంలో కనిపించనుంది. కరణ్ జోహార్‌తో కలిసి ఆలియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇది సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్‌లతో కలిసి ఫర్హాన్ అక్తర్ యొక్క జీ లే జరాలో కూడా అలియా నటించాల్సి ఉంది. ఈ సినిమా ఆగిపోలేదని ఇటీవల ప్రియాంక చోప్రా కన్ఫామ్ చేసింది. తన భర్త, రణబీర్ కపూర్ -విక్కీ కౌశల్‌తో కలిసి సంజయ్ లీలా భన్సాలీ 'లవ్ అండ్ వార్'లో నటించనుంది. ఇవే కాకుండా YRF స్పై యూనివర్స్‌లో ఒక యాక్షన్ చిత్రంలోను నటించనుంది.