ఆలియా భట్ కి జక్కన్న ఇచ్చిన సలహా ఏంటో తెలుసా..?
ఇటీవల ఆలియా భట్ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ... తన కెరీర్ లో దర్శకుడు రాజమౌళి నుంచి ఉత్తమ సలహా అందుకున్నట్లుగా చెప్పుకొచ్చింది.
By: Tupaki Desk | 15 March 2024 8:30 AM GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తెలుగు లో రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాను చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో ఆలియా పాత్ర విషయంలో ఆమె ఫ్యాన్స్ కొందరు నిరుత్సాహం వ్యక్తం చేసినా కూడా ఆమె మాత్రం అంతటి ప్రతిష్టాత్మక సినిమాలో కనిపించినందుకు ఆనందం వ్యక్తం చేసింది.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల అయిన తర్వాత పలు వేధికలపై రాజమౌళి గురించి, చిత్ర యూనిట్ సభ్యుల గురించి ఆమె మాట్లాడుతూ ప్రశంసలు కురిపించిన విషయం తెల్సిందే. తాజాగా మరోసారి రాజమౌళి గురించి ఆలియా భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇటీవల ఆలియా భట్ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ... తన కెరీర్ లో దర్శకుడు రాజమౌళి నుంచి ఉత్తమ సలహా అందుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. 'ఎలాంటి సినిమా ఒప్పుకున్నా, ఎలాంటి పాత్ర ఒప్పుకున్నా కూడా దాన్ని ప్రేమించు... ఆ పాత్ర కోసం బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించు.. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు' అంటూ రాజమౌళి సలహా ఇచ్చారు అంది.
రాజమౌళి తో మళ్లీ వర్క్ చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అని గతంలో ఒక చిట్ చాట్ లో ఆలియా భట్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఇక తన భర్త రణబీర్ కపూర్ తో త్వరలో ఒక సినిమా చేయబోతున్నట్లు ఆలియా ప్రకటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో నెం.1 హీరోయిన్ గా ఉన్న ఆలియా భట్ సౌత్ లో మళ్లీ ఎప్పుడు నటిస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.