ఆలియా వయసు 31.. చీర వయసు 160
ఇందులో అంతర్జాతీయ పాప్ స్టార్లు, బాలీవుడ్ ప్రముఖుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి
By: Tupaki Desk | 13 July 2024 5:57 AM GMTఅనంత్ అంబానీ- రాధిక మర్చంట్ జంట వివాహం ట్రెండీ టాపిక్ అయింది. ముంబైలో జరిగిన ఈ పెళ్లి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ సెలబ్రిటీలు తరలి వచ్చారు. ఇందులో అంతర్జాతీయ పాప్ స్టార్లు, బాలీవుడ్ ప్రముఖుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మరోవైపు చీర కట్టులో బాలీవుడ్ చక్కనమ్మల సందడి ఆషామాషీగా లేదు. ముఖ్యంగా ఈ పెళ్లిలో అలియా భట్ (31) రిఫ్రెష్ లుక్ ప్రస్తుతం ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. ఆలియా రొటీన్ కి భిన్నంగా చీరలో ప్రత్యక్షమైంది. సాంప్రదాయ చీర లుక్ కోసం ఆలియా రెగ్యులర్ గా ఉపయోగించే లెహంగాలు, చోళీలను లైట్ తీస్కుంది. రొటీన్ కి భిన్నంగా ఒక వైవిధ్యమైన చీరను ఎంచుకుంది. నిజానికి పెళ్లి కోసం ఆలియా ధరించినది కేవలం ఒక చీర కాదు.. అది పాతకాలపు కళాఖండం.
జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల పెళ్లికి విచ్చేసిన కళ్లన్నీ ఆలియా చీరపైనే వాలిపోయాయి అంటే అతిశయోక్తి కాదు. ఈ చీరలో ఆలియా అంత అద్భుతంగా కనిపించింది. నిజానికి
అలియా భట్ సాధారణంగా నేటి ట్రెండ్స్, స్టైలింగ్‌కు అంబాసిడర్ తరహా. పాతకాలపు సాంప్రదాయకమైన విధానంలో కనిపించడం అరుదు. కానీ తనదైన సంతకం కోసం ఆలియా కొత్తశైలిలో కనిపించింది. నిజానికి పెళ్లి కోసం ఆలియా కట్టిన చీర 160 ఏళ్ల నాటిది. ఈ చీర డిజైన్ కోసం నిజమైన బంగారం, వెండిని ఉపయోగించారని తెలిసింది. ఫంక్షన్‌కు వచ్చిన ఎ-లిస్టర్‌లందరిలో అలియా భట్ - రణబీర్ కపూర్ తమ ఎథ్నిక్ వేర్‌లో అల్టిమేట్ పవర్ కపుల్‌గా కనిపించారు. అలియా క్వీన్ పింక్ చీరలో స్ట్రాప్‌లెస్ బ్లౌజ్‌తో కనిపించింది. తను ధరించిన భారీ ఆభరణాలు సొగసైన కేశాలంకరణ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
160 ఏళ్ల క్రితం నేసిన ఆశావళి చీర గుజరాత్‌లో స్వచ్ఛమైన పట్టు 99 శాతం స్వచ్ఛమైన వెండితో కూడిన నిజమైన జరీ బార్డర్ తో రూపొందించినది. ఇన్‌స్టా పేజీ డైట్ సభ్యా ప్రకారం... చీరలో ఈ అద్భుతమైన రీగల్ లుక్‌ని అందించడానికి సుమారు 6 గ్రాముల బంగారాన్ని ఉపయోగించారు. చీర మనీష్ మల్హోత్రా ఆర్కైవల్ వీవ్ సేకరణలో భాగం. భారీ డైమండ్ సెట్‌తో ఆలియా లుక్ ని డిజైన్ చేయడం ఆసక్తికరం. డైమండ్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులు, మాంగ్ టిక్కా స్టేట్‌మెంట్ తో ఆలియా సరికొత్తగా కనిపించింది.