Begin typing your search above and press return to search.

గూఢ‌చ‌ర్యంలో శిక్ష‌ణ పొందిన స్టార్ హీరోయిన్

ఆల్ఫాలో ఆలియా భట్ ఆరు ప్రధాన యాక్షన్ సీక్వెన్సుల్లో కనిపించనుంది. దానికి అనుగుణంగా ఇటీవ‌ల ఆలియా శిక్షణ పొందిందని తెలిసింది.

By:  Tupaki Desk   |   11 July 2024 6:56 AM GMT
గూఢ‌చ‌ర్యంలో శిక్ష‌ణ పొందిన స్టార్ హీరోయిన్
X

ఆర్.ఆర్.ఆర్- బ్ర‌హ్మాస్త్ర లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాల్లో న‌టించిన ఆలియా భ‌ట్.. గంగూభాయి క‌థియావాడీ లాంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రంలోను న‌టించింది. క‌మ‌ర్షియ‌ల్ సినిమా లేదా ఆర్ట్ సినిమా .. కంటెంట్ ఏదైనా కానీ త‌న పాత్ర‌కు జీవం పోయ‌డంలో ఆలియా త‌ర్వాతే. భార‌త‌దేశంలోని అత్యంత ప్ర‌తిభావంతురాలైన న‌టిగా ఆలియా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో అత్యంత క్రేజీ స్టార్ గా అవ‌త‌రించింది.

ఆలియా ఇప్పుడు మ‌రో ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌టించ‌నుంది. ఈసారి ఫుల్ మూవీ యాక్ష‌న్ క్వీన్ అవ‌తార్ లో ర‌క్తి క‌ట్టించ‌బోతోంది. ఈ సినిమా టైటిల్ ఆల్ఫా. ప్ర‌తిష్ఠాత్మ‌క YRF స్పై యూనివర్స్‌లో భాగం. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఆలియా భట్ RAW ఏజెంట్‌గా నటించ‌నుంది. ఆల్ఫాలో ఆలియా భట్ ఆరు ప్రధాన యాక్షన్ సీక్వెన్సుల్లో కనిపించనుంది. దానికి అనుగుణంగా ఇటీవ‌ల ఆలియా శిక్షణ పొందిందని తెలిసింది. ఇటీవల ముంబైలో ఆల్ఫా చిత్రీకరణను కూడా ప్రారంభించారు. ప్ర‌స్తుతం ఆలియాపై స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నార‌ని కూడా తెలుస్తోంది.

ఈ చిత్రంలో శ‌ర్వ‌రి వాఘ్ మ‌రో కీల‌క పాత్ర‌ను పోషిస్తుండ‌గా, శివ రావైల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దాదాపు 150 కోట్ల బ‌డ్జెట్ తో ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎక్కువ భాగం యునైటెడ్ కింగ్‌డమ్‌లో చిత్రీకరించనున్నారు. బాలీవుడ్ సీనియ‌ర్ నటుడు అనిల్ కపూర్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నాడు. అతను ఆల్ఫాలో అలియాకు గురువుగా నటిస్తున్నార‌ని తెలిసింది.

స్పై యూనివ‌ర్శ్ లో సినిమాల‌ను తెర‌కెక్కించ‌డంలో సిద్ధార్థ్ ఆనంద్, అబ్బాస్ అలీ జాఫ‌ర్ సుప్ర‌సిద్ధులు. కానీ శివ రావైల్ ఈ త‌ర‌హా ప్ర‌య‌త్నం చేస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. అత‌డి గ‌త సినిమాల ట్రాక్ ప‌రిశీలిస్తే విజ‌యాలు అత‌డి ఖాతాలో ఉన్నాయి. భోపాల్ గ్యాస్ ట్రాజెడీ ఆధారంగా విమర్శకుల ప్రశంసలు పొందిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ `ది రైల్వే మెన్‌`కి దర్శకత్వం వహించిన శివ రావైల్ ఈసారి స్పై స్టోరితో సినిమాని తెర‌కెక్కిస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. వైఆర్ఎఫ్ సంస్థ రాజీ అన్న‌దే లేకుండా ఈ చిత్రానికి బ‌డ్జెట్ల‌ను స‌మ‌కూరుస్తోంది.