Begin typing your search above and press return to search.

ఆ న‌వ్వులోనే అలియా అంద‌మంతా!

హీరోయిన్ల అందాల గురించి వ‌ర్ణించ‌డం ఎవ‌రికి సాధ్యం. దివి నుంచి భువికి దిగొచ్చిన దేవ క‌న్య‌లే అంతా.

By:  Tupaki Desk   |   27 Nov 2023 11:16 AM GMT
ఆ న‌వ్వులోనే అలియా అంద‌మంతా!
X

హీరోయిన్ల అందాల గురించి వ‌ర్ణించ‌డం ఎవ‌రికి సాధ్యం. దివి నుంచి భువికి దిగొచ్చిన దేవ క‌న్య‌లే అంతా. కానీ ఒక్కొక్క‌రి లో ఒక్కో ప్ర‌త్యేక‌త. కొంద‌రు నేచుర‌ల్ బ్యూటీతో అందంగా మెప్పిస్తే ..మ‌రికొంత మంది మ్యాక‌ప్ బ్యూటీలో అల‌రిస్తుంటారు. ఇంకా డిజైన‌ర్ దుస్తులు..సొగ‌సైన ఔట్ ఫిట్స్ తో మ‌రింత అందంగా క‌నిపిస్తుంటారు. ఇక అలియాభ‌ట్ అందం గురించైతే చెప్పాల్సిన పనిలేదు.


అమ్మ‌డు మ్యాకప్ వేసినా.. వేయ‌కున్నా నేచుర‌ల్ బ్యూటీతోనూ కుర్ర‌కారుని ఆక‌ర్షిస్తుంది. తాజాగా అలియా ఫిలిం అవార్డుల్లో త‌ళుక్కున‌ మెరిసిన ఫోటోలు ఒక్కోక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇందులో అమ్మ‌డు బ్యూటీ అంతా ఆ న‌వ్వులోనే దాగి ఉంద‌నేలా ఓ ఫోజు నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇదిగో ఇక్క‌డిలా మ‌న‌సులో సంతోషాన్ని పెదాల‌పై పెట్టి ఎంతో సంపూర్ణంగా నవ్వుతోంది.


ముఖం నేచుర్ బ్యూటీతోనే క‌నిపిస్తుంది. బ్లాక్ క‌ల‌ర్ ఔట్ ఫిట్ లో ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. ఇక అలియా చెవులీలు సంథింగ్ స్పెష‌ల్ అని చెప్పాలి. రింగు రింగు చెవులీలు అలియా బ్యూటీని మ‌రింత హైలైట్ చేస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలం లో వైర‌ల్ గా మారింది. అభిమానులంతా అమ్మ‌డి న‌వ్వుకే ఫిదా అవుతున్నారు. ఇక అలియాభ‌ట్ కెరీర్ బాలీవుడ్ లో దేదీప్య‌మానంగా సాగిపోతుంది.


ఇటీవ‌లే జాతీయ ఉత్త‌మ న‌టి అవార్డు సైతం కైవ‌సం చేసుకుని న‌టిగా మ‌రో మెట్టు పైకెక్కింది. వెండి తెర‌పై అమ్మ‌డు చేసిన వైవిథ్య‌మైన పాత్ర‌కు గాను గొప్ప గౌర‌వం ద‌క్కింది. అతిపిన్న వ‌య‌సులోనే జాతీయ అవార్డు అందుకున్న న‌టిగా రికార్డు సైతం సృష్టించింది.