YRF స్పై యూనివర్స్‌లో ఆలియా వీరవిహారం
తాజా కథనాల ప్రకారం వారు యాక్షన్ ఎంటర్‌టైనర్లో సూపర్ ఏజెంట్లుగా నటించనున్నారు.
By: Tupaki Desk | 7 March 2024 6:39 AM GMTయాక్షన్ సినిమాలతో వందల కోట్లు కొల్టగొట్టేందుకు యష్ రాజ్ ఫిలింస్ భారీ ప్రణాళికల్ని విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. YRF స్పై యూనివర్స్ పేరుతో భారీ చిత్రాలను నిర్మిస్తోంది. తాజాగా ఈ యూనివర్శ్ లో ఆలియా భట్ చేరికను అధికారికంగా ప్రకటించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ సీఈఓ అక్షయ్ విధాని ఈ ఎగ్జయిటింగ్ వార్తను ధృవీకరించడంతో అలియా భట్ YRF స్పై యూనివర్స్‌లో చేరడంపై ఊహాగానాలకు ముగింపు దొరికింది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రంలో శర్వరి వాఘ్‌తో కలిసి నటించేందుకు ఆలియా సిద్ధమైంది. తాజా కథనాల ప్రకారం వారు యాక్షన్ ఎంటర్‌టైనర్లో సూపర్ ఏజెంట్లుగా నటించనున్నారు.
YRF స్పై యూనివర్స్‌లోని కొత్త డెవలప్‌మెంట్ వివరాలను అక్షయ్ విధాని వెల్లడిస్తూ.. ఇలా అన్నారు. ``నేను పరిశ్రమలో అత్యంత గోప్యంగా ఉంచిన రహస్యాన్ని షేర్ చేస్తున్నా. అలియా భట్ స్పై యూనివర్స్ చిత్రానికి హెడ్‌లైన్‌గా మారుతోంది. షెడ్యూల్ ఈ సంవత్సరం చివర్లో ప్రారంభమవుతుంది. కానీ మీకు తెలుసా? ఈ గూఢచారి విశ్వం స్టూడియోలో ఈ IPని కలిగి ఉన్నందుకు మేము చాలా థ్రిల్లింగ్‌గా ఉన్నాం`` అని అన్నారు. YRF స్పై యూనివర్స్ భారీ పెట్టుబడులతో ఒక ఆర్థిక సాంస్కృతిక జగ్గర్నాట్ అని నేను భావిస్తున్నాను. అత్యంత విలువైన ఫ్రాంఛైజీలలో ఒకటిగా మేము చాలా గర్వపడుతున్నాము. కాబట్టి గూఢచారి విశ్వంలో చాలా అంశాలు మీరు చూడబోతున్నారు. ఈ యూనివర్శ్ లో ఎక్కువ సినిమాలు రూపొందడం మనం చూడబోతున్నాం. అయితే ప్రతిదీ ఇప్పుడే చెప్పలేను. మేము దాని గురించి మరింత అనుకూలమైన సమయంలో మాట్లాడుతాం. అయితే ప్రస్తుతానికి అలియా భట్ స్పై యూనివర్స్ చిత్రానికి అదనపు బలంగా నిలుస్తోందని చెప్పగలను`` అని అన్నారు.
ఆలియా తదుపరి చిత్రం జిగ్రా విడుదల ప్రచారం కోసం సిద్ధమవుతోంది. వాసన్ బాలా దర్శకత్వం వహించిన జిగ్రాను కరణ్ జోహార్ -అలియా స్వయంగా నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రానుంది. దర్శకుడు వాసన్ బాలా గతంలో మోనికా ఓ మై డార్లింగ్, క్రైమ్ థ్రిల్లర్ చిత్రం పెడ్లర్స్ , మర్ద్ కో దర్ద్ నహీ హోతా వంటి చిత్రాలను గతంలో తెరకెక్కించారు. జిగ్రాను గతేడాది సెప్టెంబర్‌లో ప్రకటించారు. అనౌన్స్‌మెంట్ వీడియోలో ఈ చిత్రంలో ఒక సోదరికి తన సోదరుడిపై ఉన్న ప్రేమ అతడిని రక్షించడానికి ఆమె ఏదైనా చేస్తుంది అనే కథను తెరపై చూపిస్తున్నామని తెలిపారు.