జాతీయ అవార్డుల కోసం పెళ్లి చీరలో ఆలియా!
ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తుండడం ఆసక్తిని కలిగించింది. ఎందుకంటే ఆలియా తన మొదటి జాతీయ అవార్డును అందుకోవడానికి తన పెళ్లి చీరను ధరించి చాలా అందంగా కనిపించింది.
By: Tupaki Desk | 17 Oct 2023 12:16 PM GMTదిల్లీ విజ్ఞాన్ భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా నేడు అల్లు అర్జున్ సహా పలువురు తారలు జాతీయ అవార్డులు అందుకోవడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. మధ్యా హ్నం 2 గం.ల నుంచి ఈ కార్యక్రమం దూరదర్శన్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది. ఈ వేదిక వద్ద అల్లు అర్జున్- స్నేహారెడ్డి జంట సహా అల్లు అర్జున్ - కృతి సనోన్ ముచ్చట్లు హైలైట్ గా కనిపించాయి. ఇక ఇదే వేదిక వద్ద ఎస్.ఎస్.రాజమౌళి , కీరవాణి తదితరులు ఉన్నారు.
ఆసక్తికరంగా ఈ వేదికపై ఉత్తమ కథానాయికలుగా కృతిసనన్- ఆలియా భట్ జాతీయ అవార్డును షేర్ చేసుకోనున్నారు. వేదిక వద్ద కృతి బన్నీతో కలిసి కనిపించగా, ఆలియా భట్ తన భర్త అయిన రణబీర్ కపూర్ తో ప్రత్యక్షమైంది. భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి తన మొదటి జాతీయ అవార్డును అందుకోవడానికి అలియా భట్ తన పెళ్లి చీరను ధరించడం సర్వత్రా ఆసక్తికర చర్చకు తావిచ్చింది.
రణబీర్ కపూర్‌పై తన ప్రేమను మరొక స్థాయికి తీసుకువెళ్లేందుకే ఆలియా ఇలా చేస్తోందంటూ నెటిజనులు ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తుండడం ఆసక్తిని కలిగించింది. ఎందుకంటే ఆలియా తన మొదటి జాతీయ అవార్డును అందుకోవడానికి తన పెళ్లి చీరను ధరించి చాలా అందంగా కనిపించింది.
ఈ చీరను చూడగానే.. అవును, అదే చీర అంటూ అభిమానులు కనిపెట్టేసారు. పెళ్లి చీరను మళ్లీ ధరించడం అంటే ఇది ఎంత అందమైన రోజు అంటూ ఫ్యాన్స్ థమ్సప్ చూపిస్తున్నారు. అలియా భట్ తన అద్భుతమైన అందంతో ఢిల్లీలో తన మొదటి జాతీయ అవార్డును అందుకోవడానికి ఇలా ప్రిపేర్డ్ గా విచ్చేసింది. గంగూబాయి కతియావాడి చిత్రానికి గాను అలియా భట్ ఉత్తమ నటిగా మొదటి జాతీయ అవార్డును గెలుచుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కృతితో సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందుకోనుంది. మిమి చిత్రంలో నటనకు గాను కృతి సనోన్ ఉత్తమ నటిగా ఈ అవార్డును అందుకోనుంది.