Begin typing your search above and press return to search.

హీరోయిన్లకు ఆ బ్యాన‌ర్ తొలిసారి పెద్ద పీట‌!

అందులోనూ లేడీస్ తో యాక్ష‌న్ చిత్రాల జోలికైతే అస‌లే వెళ్ల‌దు.

By:  Tupaki Desk   |   17 Jun 2024 11:30 AM GMT
హీరోయిన్లకు ఆ బ్యాన‌ర్ తొలిసారి పెద్ద పీట‌!
X

బాలీవుడ్ లో లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌నేవి చాలా అరుదు. ఏ నిర్మాణ సంస్థ‌గానీ ఆ జాన‌ర్ చిత్రాల‌కు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌దు. మేల్ డామినేటెడ్ ఇండ‌స్ట్రీ కావ‌డంతో వాటికి పెద్ద పీట వేయదు. అందులోనూ యశ్ రాజ్ ఫిలింస్ లాంటి ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ అయితే వాటిని ఓ వృద్ధా ప్ర‌య‌త్నంగానే అభివ‌ర్ణిస్తుంది. అందులోనూ లేడీస్ తో యాక్ష‌న్ చిత్రాల జోలికైతే అస‌లే వెళ్ల‌దు. అయితే అది ఇప్ప‌టి వ‌ర‌కూ వున్న మాట‌.

నేడు వైఆర్ ఎఫ్ తీరు మారుతున్న‌ట్లే క‌నిపిస్తుంది. తొలి సారి ఆ సంస్థ లేడీ ఓరియేంటెడ్ సినిమాలు నిర్మించ‌డానికి రెడీ అవుతోంది. దీనిలో భాగంగా మొద‌టి ప్ర‌య‌త్నంగా అలియాభ‌ట్ తో చేస్తోంది. ఆమెతో పాటు శార్వ‌రీ వాఘ్ కూడా న‌టిస్తుంది. ఇద్ద‌ర్నీ మెయిల్ లీడ్స్ కి ఎంపిక చేసి ఓ సినిమా చేస్తున్న‌ట్లు తాజాగా శార్వ‌రీ రివీల్ చేసింది. ఇప్ప‌టివ‌ర‌కూ వైఆర్ ఎఫ్ స్పై యూనివ‌ర్శ్ లో ఎన్నో చిత్రాలు వ‌చ్చినా ఎప్పుడు అగ్ర హీరోలే ఆ బాధ్య‌త తీసుకున్నారు.

ఇప్పుడా అవ‌కాశం తొలిసారి మ‌మ్మ‌ల్ని వ‌రించింది. య‌శ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న తొలి మ‌హిళా ప్రాధాన్య‌మున్న యాక్ష‌న్ చిత్ర‌మిది. ఈ సినిమా కోసం ఇప్ప‌టికే క‌స‌ర‌త్తులు ప్రారంభించాను. ప్ర‌స్తుతం హీరోయిన్లు అంతా భిన్న‌మైన పాత్ర‌లు పోషించ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. ప‌రిశ్ర‌మ‌లో ఇదొక కీల‌క‌మైన స‌మ‌యం. అద్బుత‌మైన అలియాభ‌ట్ తో న‌టించ‌డానికి ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను. దీన్ని ఎంతో బాధ్య‌త‌గా తీసుకుంటున్నాను` అని అంది.

శార్వ‌రీ వాఘ్ ఇటీలే `ముంజ్యా`తో మంచి విజ‌యం అందుకుంది. త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల్ని క‌ట్టి ప‌డే సింది. ఈ నేప‌థ్యంలో య‌శ్ రాజ్ బ్యాన‌ర్ లో ఛాన్స్ రావ‌డం, అందులోనూ అలియాతో క‌లిసి న‌టించే అరుదైన అవ‌కాశం రావ‌డంతో శార్వ‌రీ స్టార్ డ‌మ్ రెట్టింపు అవ్వ‌డం ఖాయ‌మంటున్నారు. మ‌రి ఈ త్ర‌యం ఎలాంటి సంచ‌ల‌నం న‌మోదు చేస్తుందో చూడాలి.జ‌