Begin typing your search above and press return to search.

`హిట్-3` లో విల‌న్ ఎవ‌రంటే?

నేచుర‌ల్ స్టార్ క‌థానాయ‌కుడిగా శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో `హిట్-3` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Oct 2024 5:44 AM GMT
`హిట్-3` లో విల‌న్ ఎవ‌రంటే?
X

నేచుర‌ల్ స్టార్ క‌థానాయ‌కుడిగా శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో `హిట్-3` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య సినిమా రూపొందుతుంది. హిట్ అంటే మార్కెట్ లో ఓ బ్రాండ్ గా మారిపోయింది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన రెండు భాగాలు భారీ విజ‌యం సాధించాయి. క్రైమ్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ లో రూపొందిన సినిమాలు ప్రేక్ష‌కుల‌కు ఓ కొత్త అనుభూతిని పంచాయి. ఈ నేప‌థ్యంలో పార్ట్ -3పై అంచ‌నాలు భారీగా ఏర్ప‌డుతున్నాయి.

సినిమాని అంతే ప్ర‌తిష్టాత్మ‌కంగా నాని త‌న సొంత బ్యాన‌ర్ వాల్ పోస్ట‌ర్ పై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్లాన్ చేస్తున్నారు. స్టోరీ డిమాండ్ మేర‌కు శేలేష్ కొల‌ను వీలైన‌న్ని రాష్ట్రాల్లో షూటింగ్ ప్ర‌ణాళిక వేసి ముందుకెళ్తున్నారు. ప్ర‌స్తుతం వైజాగ్ లో షూటింగ్ జ‌రుగుతోంది. అడ‌వి వ‌రం సెంట్ర‌ల్ జైల్ లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఇందులో నాని కిజోడీగా శ్రీనిధి శెట్టి న‌టిస్తోంది.

మ‌రి ఈ సినిమా ప్ర‌ధాన విల‌న్ ఎవ‌రు? అన్న‌ది ఇంత‌వ‌ర‌కూ బ‌య‌ట‌కు రాలేదు. క్రైమ్ ని ఆర్గ‌నైజ్ చేసే ఆ పాత్ర అంటే సినిమాకి ఎంతో కీల‌కం. ఆ పాత్ర‌ని బేస్ చేసుకునే హీరో రోల్ కీల‌కంగా ఉంటుంది. మ‌రి అలాంటి ఇంట్రెస్టింగ్ రోల్ కి ఎవ‌రు ఎంపిక‌య్యారు అంటే? బాలీవుడ్ నటుడు, `మీర్జాపూర్` ఫేమ్ అలీ ఫజల్ ని తీసుకున్నారు. అలీ ఫ‌జ‌ల్ అతి త్వరలో సెట్స్‌లో జాయిన్ అవుతాడు.

అందుకు గానూ అలీ ఫ‌జ‌ల్ కి భారీ రెమ్యున‌రేష‌న్ ఇచ్చి మ‌రీ తీసుకొచ్చిన‌ట్లు స‌మాచారం. న‌టుడిగా అత‌డికి మంచి పేరుంది. ఇలాంటి క్రైమ్ పాత్ర‌లు దొరికితే చెల‌రేగిపోతాడు. గ‌తంలో చాలా చిత్రాల్లో ఉగ్ర‌వాది పాత్ర‌ల‌తోనూ ప్రేక్ష‌కుల్ని అల‌రించిన న‌టుడు అలీ. ఈ నేప‌థ్యంలో అత‌డి ఎంట్రీ హిట్-3 కి క‌లిసొచ్చే అంశం. సినిమా షూటింగ్ కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు. మొత్తం షూట్ మూడు నెల‌ల్లో పూర్తి చేస్తార‌ని స‌మాచారం. ఈ సినిమా అనంత‌రం నాని..శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతాడు.