భర్త ఒడిలో భార్య..ఎంత ప్రేమగా అంటే?
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన సిరీస్ కి మంచి రెస్పాన్స్ రావడంతో రిచా చద్దా సైతం ఆడియన్స్ కి మరింత దగ్గరైంది.
By: Tupaki Desk | 17 July 2024 6:00 AM GMTబాలీవుడ్ నటి రిచాచద్దా ఈ ఏడాది ఫిబ్రవరిలో గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. తల్లిగా ప్రమోషన్ అందుకున్నానంటూ రిచా తాను గర్భందాల్చిన విషయాన్ని రివీల్ చేసింది. అప్పటి నుంచి అమ్మడు ఎలాంటి సినిమా షూటింగ్ లకు హాజరు కాలేదు. ఇంటి వద్దనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటుంది. ఈ ఏడాది `హీరామండి` వెబ్ సిరీస్ తో మెప్పించింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన సిరీస్ కి మంచి రెస్పాన్స్ రావడంతో రిచా చద్దా సైతం ఆడియన్స్ కి మరింత దగ్గరైంది.
గత ఏడాది `ఫర్కీ`తో అలరించిన అమ్మడు కొత్త ఏడాది మాత్రం వెబ్ సిరీస్ తో బ్లాక్ బస్టర్ అందుకుంది. రిలీజ్ సమయంలో ప్రచారంలోనూ రిచా చద్దా భాగమైంది. ఆ తర్వాత ఒక్కసారిగా కనుమరుగైంది. కొత్త ప్రాజెక్ట్ లు ప్రకటించలేదు. భవిష్యత్ ప్రణాళిక రివీల్ చేయలేదు. ఇలా ఎందుకంటే కొన్ని నెలలు పాటు ఎలాంటి ఒత్తిడి తీసుకోవడానికి ఆమె సిద్దంగా లేదు. ప్రసవం అయిన తర్వాత..సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకునే వరకూ సినిమాలకు దూరంగా ఉంటుంది.
అంతవరకూ తన లోకం కడుపులో పెరుగుతోన్న బిడ్డ మాత్రమే. భర్త అలీ ఫైజల్ సైతం భార్యతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు. షూటింగ్ ఉంటే సెట్లో లేదంటో ఇంట్లో భార్యతోనే ఉంటున్నాడు. తాజాగా ఇన్ స్టా వేదికగా భార్యభర్తలిద్దరు ఎంతో ప్రేమగా మెలుగుతోన్న సందర్భాన్ని పిక్ రూపంలో తీసుకొచ్చారు. ఇదిగో ఇక్కడిలా భర్త ఒడిలో రిచా చద్దా సేద తీరుతుంది. ఇరువురు బేబి బంప్ ని చూస్తూ పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందని ఊహించుకుంటున్నారు.
ఈ సమయంలో భర్త ప్రేమ రిచాకి ఎంతో అవసరం. నెలలు నిండుతోన్న గర్బిణీ సమయంలో భర్త పంచే ప్రేమ ఎంతో కీలకమైనది. ఆ రకంగా అలీ ఫైజల్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులంతా పుట్టబోయే బిడ్డ కు ముందుగానే అడ్వాన్స్ వెల్కమ్ చెప్పేస్తున్నారు.