స్టార్ సింగర్ కి అరుదైన జబ్బు
ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇటీవల తన అరుదైన జబ్బు గురించి చెప్పి షాక్ ఇచ్చింది.
By: Tupaki Desk | 19 Jun 2024 12:30 AM GMTహిందీ, తెలుగు సహా దాదాపు 25 భాషల్లో పాటలు పాడి శ్రోతలను అలరించిన గాయిని అల్కా యాగ్నిక్. ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇటీవల తన అరుదైన జబ్బు గురించి చెప్పి షాక్ ఇచ్చింది.
న్యూరల్ నెర్వ్ సెన్సోరీ లాస్ అనే అరుదైన జబ్బు తో బాధపడుతున్నట్లుగా పేర్కొంది. కొన్ని వారాల క్రితం తాను విమానం నుంచి బయటకు రాగానే అకస్మాత్తుగా వినికిడి ని కోల్పోయాను అంటూ చెప్పుకొచ్చింది. తాను ఎదుర్కొంటున్న సమస్య పై అల్కా క్లారిటీ ఇచ్చింది.
తాను వినికిడి సమస్య ను ఎదుర్కొంటున్న కారణంగానే పాటలకు దూరం అయినట్లుగా చెప్పుకొచ్చింది. తనకు జీవితంలో అత్యంత ముఖ్యమైన పాటలను ఇలా వదిలేస్తాను అనుకోలేదు అంటూ ఎమోషనల్ వ్యాఖ్యలు చేసి ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు కూడా ఎమోషనల్ అయ్యేలా చేసింది.
లౌడ్ మ్యూజిక్, హెడ్ ఫోన్స్ ను ఎక్కువగా వినియోగించడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి అంటూ ఆమె పేర్కొంది. తన ఫ్యాన్స్ తో పాటు, ఇతరులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ ఆమె సూచించింది.