Begin typing your search above and press return to search.

ఓటీటీ: స్త్రీ 2 కంటే ఆ ఫ్లాప్ సినిమాపైనే అందరి ఫోకస్

ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చాక ఫలితం పూర్తిగా మారిపోయింది.

By:  Tupaki Desk   |   11 Oct 2024 12:30 PM GMT
ఓటీటీ: స్త్రీ 2 కంటే ఆ ఫ్లాప్ సినిమాపైనే అందరి ఫోకస్
X

హిందీలో ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం ‘స్త్రీ 2’. శ్రద్ధా కపూర్, రాజ్ కపూర్ రావు లీడ్ రోల్ లో తెరకెక్కిన ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ వరల్డ్ వైడ్ గా 800 కోట్లు కలెక్ట్ చేసింది. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టిన చిత్రంగా ‘స్త్రీ 2’ మూవీ నిలిచింది. ‘కల్కి 2898ఏడీ’ తర్వాత ఇండియాలో అత్యధిక వసూళ్లు అందుకున్న చిత్రంగా ఈ సినిమా రికార్డ్ సృష్టించింది. థియేటర్స్ లో ఈ సినిమాకి ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు.

బాలీవుడ్ లో చాలా సినిమాల రికార్డ్స్ ని ‘స్త్రీ 2’ బ్రేక్ చేసింది. ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చాక ఫలితం పూర్తిగా మారిపోయింది. థియేటర్స్ లో కంటే భిన్నమైన రిజల్ట్ డిజిటల్ ఆడియన్స్ నుంచి వస్తోంది. ‘స్త్రీ 2’ కి పోటీగా అక్షయ్ కుమార్ ‘ఖేల్ ఖేల్ మే’ మూవీ ఆగష్టు 15న రిలీజ్ అయ్యింది. 100 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో కేవలం 50 కోట్ల లోపు కలెక్షన్స్ అందుకొని బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

అయితే ఓటీటీలో మాత్రం ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది. ‘స్త్రీ 2’ కంటే ‘ఖేల్ ఖేల్ మే’ సినిమా చూడటానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రెండు సినిమాలు అక్టోబర్ 10న ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. నెటిజన్లు అక్షయ్ కుమార్ ‘ఖేల్ ఖేల్ మే’ సినిమాని భాగా ఆదరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో మూవీ ఉందని కామెంట్స్ వస్తున్నాయి.

అలాగే ‘స్త్రీ 2’ తో పోల్చుకుంటే ఖేల్ ఖేల్ మే చాలా బెటర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. అక్షయ్ కుమార్ మూవీని థియేటర్స్ లో మిస్ అయ్యి బాధపడుతున్నామని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. తాప్సి పెర్ఫార్మెన్స్ అయితే అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే చాలా ఇంటరెస్టింగ్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. చిన్న చిన్న మైనస్ లు ఉన్న కూడా ఓవరాల్ గా మంచి ఫన్ జెనరేట్ చేసిందని అంటున్నారు.

ఈ దసరా వీకెండ్ లో ఎవరైనా మూవీ చూడాలనుకుంటే ‘ఖేల్ ఖేల్ మే’ రిఫర్ చేస్తానని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. మూవీలో అక్షయ్ కుమార్ లుక్ కాస్తా డిజపాయింట్ చేసిందని ఓవరాల్ గా కంటెంట్ మాత్రం బాగుందని ఇంకొకరు పోస్ట్ పెట్టారు. దీనిని బట్టి ‘స్త్రీ 2’ కంటే ‘ఖేల్ ఖేల్ మే’ సినిమాని ఓటీటీలో ఎక్కువ మంది చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అర్ధమవుతోంది.