Begin typing your search above and press return to search.

దుల్కర్@100%.. అక్కడ కూడా 'భాస్కర్ లక్కీ'నే!

మొత్తానికి తెలుగులో దుల్కర్ నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచినట్లే. దీంతో ఆయనది 100 శాతం స్ట్రైక్ రేట్ అని చెప్పవచ్చు.

By:  Tupaki Desk   |   1 Nov 2024 5:10 AM GMT
దుల్కర్@100%.. అక్కడ కూడా భాస్కర్ లక్కీనే!
X

మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి కుమారుడిగా స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తండ్రి వారసత్వంతో వచ్చినా.. తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ దక్కించుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. తన లుక్స్ అండ్ యాక్టింగ్ తో మాలీవుడ్ లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత కోలీవుడ్ లో అడుగుపెట్టిన దుల్కర్.. ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోగా మారారు.

టాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకుని దుల్కర్ దూసుకెళ్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి మూవీతో తొలిసారి తెలుగు సినీ ప్రియులకు పరిచయమయ్యారు దుల్కర్. ఆ మూవీలో జెమినీ గణేషన్ పాత్రలో ఒదిగిపోయారు. ఆ సినిమాతో టాలీవుడ్ లో తొలి హిట్ ను అందుకున్నారు. ఆ తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్ లో సీతారామంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

లవర్ బాయ్ గా తెలుగు సినీ ప్రియులను మనసులను దోచుకున్నారు. ఆ తర్వాత రీసెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ప్రభాస్ కల్కి 2898 ఏడీలో క్యామియో రోల్ చేశారు. ఇప్పుడు లక్కీ భాస్కర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఆ చిత్రంలో దుల్కర్ మధ్యతరగతి బ్యాంకు ఉద్యోగి పాత్రలో జీవించేశారు.

తనదైన నటనతో ఆకట్టుకున్నారు. అలా తెలుగులో మరో హిట్ ను అందుకున్నారు. ఫుల్ లెంగ్త్ రోల్ పరంగా చూసుకుంటే హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నారు. కల్కితో కలిపి నాలుగు హిట్స్ ను దక్కించుకున్నారు. మొత్తానికి తెలుగులో దుల్కర్ నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచినట్లే. దీంతో ఆయనది 100 శాతం స్ట్రైక్ రేట్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన తెలుగుతో మరో సినిమా ఆకాశంలో ఒక తారలో నటిస్తున్నారు.

అదే సమయంలో మాలీవుడ్ హీరో అయిన దుల్కర్ నటించిన తెలుగు చిత్రాల డబ్బింగ్ వెర్షన్స్ ఇప్పటి వరకు అన్నీ కేరళలో రిలీజ్ అయ్యాయి. కానీ సీతారామం, మహానటి అనుకున్న స్థాయిలో ఆడలేదు. కల్కి సాలిడ్ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు లక్కీ భాస్కర్ మాత్రం మాలీవుడ్ లో దూసుకుపోతోంది. రూ.2 కోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించింది. మరి ఫుల్ రన్ లో అక్కడ లక్కీ భాస్కర్ ఎంతటి వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.