హాలీవుడ్ చిత్రాలకు పోటీగా ఇండియన్ మూవీ!
ఆరకంగా 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' అందరిలోనూ హాట్ టాపిక్ గా మారుతుంది.
By: Tupaki Desk | 10 Dec 2024 9:30 PM GMTమలయాళ చిత్రం 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' అవార్డులు...రివార్డులతో ఇప్పటికే హోరెత్తిస్తుంది. ఎలాంటి పోటీలకు వెళ్లినా? అవార్డు కైవసం చేసుకోడం ఆ చిత్రానికి పరిపాటిగా మారింది. తాజాగా మరో రికార్డు సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుకు నామినేట్ అయింది. ఈ చిత్రం రెండు విభాగాల్లో నామినేషన్ దక్కించుకోవడం విశేషం. బెస్ట్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ కేటగిరీల్లో ఈ భారతీయ చిత్రం హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతోంది.
82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల వేడుక వచ్చే ఏడాది జనవరి 5న జరగుతుంది. దానికి సంబంధించిన వివరాలను జ్యూరీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇప్పటికే ఆసియా పసిఫిక్ స్క్రీన్ పురస్కారాల్లో ఐదు నామినేషన్లు దక్కించుకుంది. కేన్స్ చలన చిత్రోత్సవాల్లో గ్రాండ్ ప్రిక్స్‌ను కైవసం చేసుకుంది. ఈ ఘనతను సాధించిన తొలి భారతీయ చిత్రం ఇదే కావడం మరో విశేషం. ఈ అవార్డులకు ఇప్పటి వరకూ భారతీయ చిత్రాలు అతి తక్కువ సంఖ్యలో నామినేట్ అయ్యాయి.
ఆరకంగా 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' అందరిలోనూ హాట్ టాపిక్ గా మారుతుంది. బెస్ట్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో 'ఆర్ఆర్ఆర్'లోని నాటు నాటు సాంగ్‌కు అవార్డు దక్కింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆ పాటకు అవార్డు వరించింది. ఈసారి గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఆల్ వి ఇమాజిన్ ఏకంగా దిగ్గజాలు రూపొందించిన హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడుతుంది.
అవార్డు రావడం ఖాయమంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా స్టోరీ లైన్ తోనే ఇంతటి గుర్తింపు దక్కుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముంబయ్ నర్సింగ్ హోమ్‌లో పని చేసే ఇద్దరు నర్సుల కథతో పాయల్ కపాడియా రూపొందించారు. గత నెలలో ఈసినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి విమర్శకులు ప్రశంసలు దక్కించు కుంది.