Begin typing your search above and press return to search.

ఊరిస్తున్న ఓజీ.. బాబోయ్‌ ఇంత క్రేజా?

ముఖ్యంగా సాహో సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమా అంతకు మించి అన్నట్లుగా క్రేజ్ ను కలిగి ఉంది.

By:  Tupaki Desk   |   15 Aug 2024 6:27 AM GMT
ఊరిస్తున్న ఓజీ.. బాబోయ్‌ ఇంత క్రేజా?
X

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరిగి కెమెరా ముందుకు ఎప్పుడు ఎప్పుడు వస్తాడు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా పవన్‌ ను మళ్లీ వెండి తెరపై చూడాలని కోరుకుంటున్నామని అంటున్నారు. అయితే పవన్ మాత్రం ఈ మధ్య ఎన్నికలు పూర్తి అయ్యాయి, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కెమెరా ముందుకు వెళ్తే జనాలు ఏమంటారో అనే భయంతో కొన్నాళ్లు గ్యాప్ ఇస్తున్నట్లుగా ఒక చిట్ చాట్‌ లో పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. త్వరలోనే పవన్‌ బ్యాక్‌ టు సెట్స్ అంటూ ఇండస్ట్రీ లో చర్చ జరుగుతోంది.

పవన్‌ కళ్యాణ్ నటిస్తున్న మూడు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. ముఖ్యంగా సాహో సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమా అంతకు మించి అన్నట్లుగా క్రేజ్ ను కలిగి ఉంది. సుజీత్‌ ఓ మాఫియా డాన్‌ గా పవన్‌ కళ్యాణ్ ను చూపించబోతున్నాడు. ఇప్పటికే సోషల్‌ మీడియాలో వచ్చిన స్టిల్స్ తో పాటు, సినిమాకు సంబంధించిన వార్తలు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. ఆకట్టుకునే కథ మరియు కథనాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు.

తాజాగా నాని హీరోగా రూపొందిన సరిపోదా శనివారం సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఆ సినిమాను నిర్మించిన దానయ్య బ్యానర్‌ లోనే పవన్‌ కళ్యాణ్ ఓజీ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ప్రీ రిలీజ్ వేడుకలో దానయ్య మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా పవన్‌ ఫ్యాన్స్ ఓజీ అంటూ నినాదాలు చేయడం మొదలు పెట్టారు. కొన్ని నిమిషాల పాటు స్టేజ్ పై ఉన్న వారు అంతా కూడా అలా నిల్చుని చూసే పరిస్థితి ఏర్పడింది. ఓజీ సినిమా గురించి చెప్పాలంటూ దానయ్య ను నిర్మాతలు పెద్ద ఎత్తున డిమాండ్‌ చేయడంతో స్టేజ్ పై ఉన్న వారు అంతా కూడా బాబోయ్ ఏంటి ఈ క్రేజ్ అంటూ షాక్ అయ్యారు.

ఇప్పటికే సగానికి పైగా ఓజీ షూటింగ్‌ పూర్తి అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ గా ప్రియాంక అరుల్‌ మోహన్ నటిస్తుండగా బాలీవుడ్‌ స్టార్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. పవన్‌ కళ్యాణ్ ను పంజా సినిమాలో ఎలా చూశామో అంతకు మించి స్టైలిష్ గా చూడటం తో పాటు మంచి మాఫియా పాత్ర లో చూపించబోతున్నాడు. సాహో సినిమాతో బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించిన దర్శకుడు సుజీత్‌ కచ్చితంగా ఓజీ సినిమాతో సెన్షేషన్‌ క్రియేట్‌ చేయడం ఖాయం అంటూ హిందీ సినీ విశ్లేషకులు కూడా నమ్ముతున్నారు. ఓజీ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ప్రస్తుతానికి ఊరిస్తున్న మేకర్స్‌ వచ్చే ఏడాదికి తీసుకు వస్తారేమో చూడాలి.