ముంబై మోడల్స్ మాకొద్దు అంటున్నారా?
గడిచిన ఐదారాళ్లేగా దిగుమతైన భామల్ని చూస్తే ఎక్కువగా మాలీవుడ్ నుంచే కనిపిస్తున్నారు.
By: Tupaki Desk | 20 May 2024 1:30 AM GMTటాలీవుడ్ లో మెంబై మోడల్స్ హవా తగ్గిందా? మోడ్రన్ బ్యూటీలకన్నా నేచురల్ బ్యూటీలకే తెలుగు ఆడియన్స్ పెద్ద పీట వేస్తున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. గడిచిన ఐదారాళ్లేగా దిగుమతైన భామల్ని చూస్తే ఎక్కువగా మాలీవుడ్ నుంచే కనిపిస్తున్నారు. ఒకప్పుడు ముంబై నుంచి హీరోయిన్లు ఎక్కువగా కనిపించేవారు. ఏ హీరోయిన్ ని కదిపినా..ముంబై...పుణే అని చెప్పుకొచ్చేవారు. ఇప్పుడా పేర్లు పెద్దగా కనిపించడం లేదు. ఎవర్ని కెలికినా కేరళ..కొట్టాయం..త్రివేండ్రం అంటున్నారు. ఇంకా ఈ కోవలో సౌత్ నుంచే అధికంగా హీరోయిన్లు కనిపిస్తున్నారు.
వాళ్ల సక్సెస్ రేట్ కూడా బాగుంది. హీరోయిన్లగా ఎక్కువ కాలం కొనసాగుతున్నారు. అందుకు కారణం వాళ్లలో నేచురల్ బ్యూటీతో పాటు... యాక్టింగ్స్ స్కిల్స్ అని చెప్పొచ్చు. నటనలో సహజత్వం.. అందంలో అచ్చ తెలుగు అమ్మాయిని తలపించడం వంటివి బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే టాలీవుడ్ లో ముంబై మోడల్స్ హవా తగ్గింది. ప్రస్తుతం ఏ దర్శక-నిర్మాతనడగినా మొదటి ఛాయిస్ గా మాలీవుడ్ భామల పేర్లే తీసుకుంటున్నారు. ముంబై హీరోయిన్లు మాకొద్దు అనే పరిస్థితి కనిపిస్తుంది.
ఒకప్పుడు హీరోయిన్ అంటే కేవలం ముంబై భామల్నే తీసుకునేవారు. వాళ్లు అయితే పూర్తిగా దర్శకులకు బాండ్ అయి పనిచేస్తారు కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ రావని భావించేవారు. పారితోషికం ఎక్కువగా ఛార్జ్ చేసినా డేట్లు విషయంలోనూ వాళ్లతో ఎలాంటి సమస్యలు రావని నిర్మాతలు బలంగా నమ్మేవారు. అందుకే ముంబై నుంచి ఎక్కువగా దిగుమతి అయ్యేవారు. విలన్ల విషయంలో కూడా కొన్ని రకాల వెసులు బాటులు దొరికేవి.
కానీ ఇప్పుడు సన్నివేశం అందుకు పూర్తి కాంట్రాస్ట్ గా కనిపిస్తుంది. కాస్టింగ్ ఏజెన్సీలు ముంబై..పుణే మోడల్స్..హీరోయిన్ల పేర్లు ఎత్తితేనే నిర్మాతలంతా నిర్మొహమాటంగా వద్దేనస్తున్నారుట. అందులోనూ అగ్ర హీరోల సినిమాలకైతే నో రిక్వైర్ మెంట్ అనేస్తున్నారుట. మరీ సినిమాలో మసాలా కంటెంట్ అధికంగా ఉంది! సౌత్ భామలు కన్విన్స్ కారు అనుకుంటే? సెకెండ్ ఆప్షన్ గా వాళ్ల పేర్లు పరిశీలనలో ఉంటున్నట్లు సమాచారం. పాపం ముంబై భామల పరిస్థితి అలా ఉందిప్పుడు.