సుడిగాడు 2 - నరేష్ ప్లాన్ ఎలా ఉందంటే..
ఇదిలా ఉంటే ‘బచ్చలమల్లి’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ‘సుడిగాడు’ సీక్వెల్ గురించి అల్లరి నరేష్ క్లారిటీ ఇచ్చాడు.
By: Tupaki Desk | 15 Dec 2024 5:15 AM GMTఅల్లరి నరేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ‘సుడిగాడు’. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని అతని కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా నిలిచింది. తెలుగు కమర్షియల్ సినిమాల స్పూఫ్ లని కథగా మార్చేసి ఈ చిత్రాన్ని భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కించారు. ఈ సినిమా తర్వాత మరల నరేష్ కి ఆ స్థాయిలో సక్సెస్ పడలేదు.
అలాగే కామెడీ హీరోగా కూడా నరేష్ వరుస ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం నరేష్ కాస్తా జోనర్ మార్చి కొత్తదనం ఉన్న కథలు ఎంచుకుంటూ మూవీస్ చేస్తున్నాడు. డిసెంబర్ 20న ‘బచ్చలమల్లి’ అనే సినిమాతో అల్లరి నరేష్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. సుబ్బు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రియల్ లైఫ్ సంఘటనలు, క్యారెక్టర్ స్ఫూర్తితో ఈ సినిమా కథని దర్శకుడు సుబ్బు చెబుతున్నారు.
ఇందులో అల్లరి నరేష్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా కొత్తగా ఉండబోతోంది. విపరీతమైన కోపం ఉన్న బచ్చలమల్లి అనే క్యారెక్టర్ లోనే నరేష్ కనిపిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నరేష్ చాలా ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని ట్రైలర్ బట్టి అర్ధమైంది. అలాగే ఇందులో యాక్షన్ సన్నివేశాలు కూడా పుష్కలంగానే ఉన్నాయి.
ఈ సినిమాతో సూపర్ హిట్ కొడతాననే నమ్మకంతో అల్లరి నరేష్ ఉన్నాడు. సినిమా కోసం నరేష్ చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ‘బచ్చలమల్లి’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ‘సుడిగాడు’ సీక్వెల్ గురించి అల్లరి నరేష్ క్లారిటీ ఇచ్చాడు. ‘సుడిగాడు 2’ ఎప్పుడు ఉంటుందని ఓ జర్నలిస్ట్ నరేష్ ని అడిగారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని చెప్పారు. ఈ సారి పాన్ ఇండియా కథల మీద స్పూఫ్ లతో ‘సుడిగాడు 2’ మూవీ సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
2026లో సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తామని అల్లరి నరేష్ క్లారిటీ ఇచ్చాడు. ‘సుడిగాడు’ కథ సిద్ధం చేయడానికి 16 నెలలు పట్టిందని, ‘సుడిగాడు 2’కి కూడా ఎక్కువ సమయం తీసుకుంటుందని అన్నారు. ఈ మూవీ వస్తే కచ్చితంగా అల్లరి నరేష్ ఖాతాలో 100 కోట్ల కలెక్షన్స్ చేరుతాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. స్పూఫ్ కథతో సినిమా చేయాలంటే అల్లరి నరేష్ ని మించి బెస్ట్ యాక్టర్ ఉండరని అంటున్నారు. మరి నరేష్ సీక్వెల్ ప్లాన్ తో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.