Begin typing your search above and press return to search.

న‌రేష్ ని గ‌ల్లా ప‌ట్టుకుని గుంజిన మ‌హిళ‌!

అయితే ఈ సినిమా రిలీజ్ అనంత‌రం అల్ల‌రి న‌రేష్ ని ఓ మ‌హిళ ఏకంగా గ‌ల్లా ప‌ట్టుకుని మ‌రీ గుంజిన సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   26 Dec 2024 7:30 PM GMT
న‌రేష్ ని గ‌ల్లా ప‌ట్టుకుని గుంజిన మ‌హిళ‌!
X

అల్ల‌రి న‌రేష్‌- గీతాసింగ్-మ‌ధుషాలిని ప్ర‌ధాన పాత్ర‌లో ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ తెర‌కెక్కించిన 'కిత‌కిత‌లు' అప్ప‌ట్లో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. హాస్య ప్ర‌ధానంగా తెర‌కెక్కిన సినిమా న‌చ్చ‌ని ప్రేక్ష‌కుడు అంటూ ఉండ‌డు. డ‌బ్బు కోసం ఆశ‌ప‌డి హీరో లావుగా ఉన్న అమ్మాయిని పెళ్లాడిన త‌ర్వాత వ‌చ్చిన స‌మ‌స్య‌లు? మ‌రోవైపు హీరో ప్రియురాలితో రాస‌లీల‌ల మ‌ధ్య సాగిన క‌థ ఇది.

చీటికి మాటికి లావుగా ఉందంటూ భార్య‌ను అవ మానిం చ‌డం..ప్రియురాలితో రొమాన్స్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన చిత్ర‌మిది. అయితే ఈ సినిమా రిలీజ్ అనంత‌రం అల్ల‌రి న‌రేష్ ని ఓ మ‌హిళ ఏకంగా గ‌ల్లా ప‌ట్టుకుని మ‌రీ గుంజిన సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఓ ఈవెంట్ లో భాగంగా టీమ్ అంతా ఏలూరు ప్ర‌చారం కోసం వెళ్తోన్న స‌మ‌యంలో ఓ మ‌హిళ న‌రేష్ పై దూసుకుంటూ వ‌చ్చిందిట‌.

అటుపై ఆగ్ర‌హించి లావుగా ఉన్న వాళ్లు పెళ్లాలుగా రాకూడ‌దా? వాళ్లు పెళ్లిళ్లు చేసు కోకూడ‌దా? అంటూ చెడామ‌డా క‌డిగేసింద‌ని తాజాగా న‌రేష్ రివీల్ చేసాడు. ఆ పెద్దావిడ ఆవేశంలో అర్ద‌ముంద‌న్నాడు. సినిమాలో అస‌లు హీరో తాను కాద‌ని..గీతాసింగ్ అని అన్నాడు. సినిమాలో హీరో ఆలోచ‌న‌లు నెగిటివ్ గా ఉంటే? గీతాసింగ్ పాత్ర ఆలోచ‌న‌లు ఎంతో పాజిటివ్ గా...స్పూర్తివంతంగా ఉంటాయ‌న్నారు.

క్లైమాక్స్ లోనే అన్ని విష‌యాలు అర్దం చేసుకుని విల‌న్ కాస్తా హీరో అవుతాడ‌న్నారు. ఆ క‌థ‌లో నేను విల‌న్..గీతా సింగ్ హీరో? అందుకే అంత పెద్ద స‌క్సెస్ సాధించింద‌న్నారు. అప్ప‌ట్లో ఆ సినిమాని 90 ల‌క్ష‌ల్లో పూర్తి చేయ‌గా 8 కోట్లు వ‌సూ ళ్లు సాధించింద‌న్నారు. అప్ప‌టి క‌థ‌ల్లో బ‌ల‌మైన హాస్యం ఉండేది. కానీ ఇప్పుటి క‌థ‌ల్లో హాస్యం అంత బ‌లంగా లేదు. అందంతా ర‌చ‌యిత‌ల మీద‌న ఆధార‌ప‌డి ఉంటుందన్నారు.