Begin typing your search above and press return to search.

నరేష్ సాబ్.. ఆ విషయంలో జాగ్రత్త పడాల్సిందే!

మ్యూజికల్ ఆల్బమ్ విషయంలో ఏమైనా ఉంటే డైరెక్టర్స్ కే చెప్పాలి అని.. హీరోది బాధ్యత కాదని పరోక్షంగా అన్నారు.

By:  Tupaki Desk   |   15 Dec 2024 6:10 AM GMT
నరేష్ సాబ్.. ఆ విషయంలో జాగ్రత్త పడాల్సిందే!
X

సాంగ్స్.. ఏ సినిమా విషయంలోనైనా కీలక పాత్ర పోషిస్తాయన్న విషయం తెలిసిందే. అందుకే మేకర్స్.. మూవీ రిలీజ్ కు ముందు లిరికల్ సాంగ్స్ ను విడుదల చేస్తుంటారు. సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యేలా చూస్తుంటారు. సాంగ్స్ సూపర్ హిట్ అయితే మూవీకి మంచి ఓపెనింగ్స్ రావడం ఇప్పటికే చాలా సార్లు చూసి ఉంటాం.

సాంగ్స్ తో బజ్ క్రియేట్ చేసే ఫార్ములాను ఇప్పటికే టాలీవుడ్ హీరోలు అనేక మంది ఫాలో అవుతున్నారు. పలువురు స్టార్ హీరోలు మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూడా పాల్గొంటున్నారు. బెస్ట్ అవుట్ పుట్ వచ్చేలా మ్యూజిక్ డైరెక్టర్స్ తో కలిసి డిస్కస్ చేస్తుంటారు. అల్లు అర్జున్, మహేష్ బాబు సహా కొందరు హీరోలు ఆడియో ఆల్బమ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు.

మంచి అవుట్ పుట్ వచ్చేలా చాలా వరకు కృషి చేస్తుంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కూడా అప్పట్లో తన సినిమాల సాంగ్స్ లో విషయంలో స్పెషల్ కేర్ తీసుకునేవారు. బహుశా అందుకేనేమో అదిరిపోయే మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. హీరోలకు ప్రత్యేక ఆసక్తి ఉండటం వల్ల దర్శకులు కూడా అంతే రీతిలో సహకరిస్తున్నారు.

అయితే ఆ విషయంలో టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ రీసెంట్ గా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మ్యూజికల్ ఆల్బమ్ విషయంలో ఏమైనా ఉంటే డైరెక్టర్స్ కే చెప్పాలి అని.. హీరోది బాధ్యత కాదని పరోక్షంగా అన్నారు. గతంలో తన సినిమాల సాంగ్స్ పెద్దగా బాగోడం లేదని అనేక మంది తనకు చెప్పారని తెలిపారు. తామేం చేయలేమని, దర్శకుడికి చెప్పాలని వ్యాఖ్యానించారు.

షూటింగ్ జరుగుతున్నప్పుడు రోజు చివరిలో ఎమోషన్ ఏంటి.. సాంగ్ ఎక్కడ పెట్టాలి.. ఎలాంటి లిరిక్స్ రాయించాలి అన్న విషయంలో డైరెక్టర్స్ కు అవగాహన ఎక్కువ ఉంటుందని నరేష్ తెలిపారు. బచ్చల మల్లి సినిమా సాంగ్స్ విషయంలో డైరెక్టర్ సుబ్బు మంగాదేవి జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. విశాల్ చంద్రశేఖర్ తో డిస్కస్ చేసుకుని కంపోజ్ చేశామని తెలిపారు.

కానీ అల్లరి నరేష్ అలా చెప్పినా.. మ్యూజిక్ ఆల్బమ్ విషయంలో హీరోలు ప్రత్యేక చొరవ తీసుకుంటే బెటర్ అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. హీరో మీడియం రేంజ్ అయినా.. చిన్న రేంజ్ అయినా.. కేర్ తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు. ఇప్పటికే యంగ్ కంపోజర్స్ ఫీల్డ్ లోకి వస్తున్నారని.. అనేక సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలుస్తున్నాయని అంటున్నారు. దానికి హీరో కేర్ తోడైతే ఇంకా తిరుగుండదని కామెంట్లు పెడుతున్నారు.