Begin typing your search above and press return to search.

అల్లరి నరేష్‌ ఆ విషయంలో ఫుల్‌ క్లారిటీ!

ఈ సినిమా తర్వాత తన నుంచి వరుసగా రెండు కామెడీ సినిమాలు రానున్నట్లుగా చెప్పాడు. ఆ రెండు కామెడీ సినిమాలు 2025లో వస్తాయని అల్లరి నరేష్ హామీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   16 Dec 2024 9:32 AM GMT
అల్లరి నరేష్‌ ఆ విషయంలో ఫుల్‌ క్లారిటీ!
X

హీరో అల్లరి నరేష్‌ కాస్త గ్యాప్‌ తీసుకుని 'బచ్చలమల్లి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈనెల 20న ప్రేక్షకుల మందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా అల్లరి నరేష్ మీడియా ముందుకు వచ్చి పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారు. ఆ సమయంలోనే బచ్చలమల్లి సినిమా కోసం తాను చాలా కష్టపడ్డాను అన్నారు. ఈ సినిమాలో చాలా సీరియస్‌ పాత్రలో కనిపించబోతున్నాను. గతంలో ఎప్పుడూ లేని విధంగా సీరియస్ రోల్‌లో నటించడం ద్వారా ప్రేక్షకులను అలరించబోతున్నట్లుగా అల్లరి నరేష్ చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా తర్వాత తన నుంచి వరుసగా రెండు కామెడీ సినిమాలు రానున్నట్లుగా చెప్పాడు. ఆ రెండు కామెడీ సినిమాలు 2025లో వస్తాయని అల్లరి నరేష్ హామీ ఇచ్చారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ మాట్లాడుతూ సీనియర్‌ స్టార్‌ హీరోలు చిరంజీవి గారు, వెంకటేష్ గార్ల సినిమాల్లో నటించాలని, వారితో కలిసి నటించాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. వారిద్దరితో సినిమాల్లో నటించే అవకాశం వస్తే తప్పకుండా ఎలాంటి పాత్ర అయినా చేసేందుకు సిద్ధమే అన్నట్లు అల్లరి నరేష్‌ తన మనసులో మాటను చెప్పుకొచ్చాడు.

ఇదే సమయంలో అల్లరి నరేష్ మల్టీస్టారర్‌ సినిమాలపై స్పందించాడు. తాను మంచి కథతో వస్తే, మంచి పాత్ర అనిపిస్తే తప్పకుండా మల్టీస్టారర్‌ సినిమాలు చేస్తాను అన్నాడు. గమ్యం, మహర్షి వంటి సినిమాలు చేయడంకు తాను ఎప్పుడూ రెడీగా ఉంటానని అన్నాడు. ఇతర హీరోలతో కలిసి నటించేందుకు తాను సిద్ధమే అని, అయితే అందుకు తగ్గట్లుగా మంచి కథలు కావాలని అల్లరి నరేష్‌ ఫుల్‌ క్లారిటీగా చెప్పుకొచ్చాడు. ముందు ముందు తన నుంచి సీరియస్‌ సినిమాలతో పాటు కామెడీ సినిమాలు వస్తాయని అల్లరి నరేష్ హామీ ఇచ్చాడు.

సుబ్బు మంగదేవి దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా రూపొందిన బచ్చలమల్లి సినిమాలో అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాని రాజేష్ దండ నిర్మించారు. ఈ సినిమాతో అల్లరి నరేష్ నటుడిగా మరోసారి తన స్థాయిని నిరూపించుకోవడంతో పాటు, ప్రేక్షకులకు ముఖ్యంగా తన అభిమానులకు మంచి సినిమాను అందించబోతున్నారు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. గత వారం పది రోజులుగా ఈ సినిమా యొక్క ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. కనుక సినిమాపై అంచనాలు ప్రేక్షకుల్లో పెరిగాయి. పుష్ప 2 జోరు తగ్గిన నేపథ్యంలో ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.