అన్నయ్యకి విలన్ సలహా ఇచ్చిన తమ్ముడు!
ఈవీవీ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆర్యన్ రాజేష్ సుపరిచితమే. `హాయ్` తో హీరోగా పరిచయమైన రాజేష్ చాలా సినిమాలు చేసాడు.
By: Tupaki Desk | 20 Dec 2024 1:30 PM GMTఈవీవీ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆర్యన్ రాజేష్ సుపరిచితమే. `హాయ్` తో హీరోగా పరిచయమైన రాజేష్ చాలా సినిమాలు చేసాడు. కానీ హీరోగా అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు. అతడి గ్లామర్ కి టాలీవుడ్ లో పెద్ద హీరో అవుతాడని భావించారు. కానీ అది జరగలేదు. కొన్ని సినిమాల్లో నటించి అటుపై ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అప్పటికే అల్లరి నరేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం సక్సెస్ అవ్వడం జరిగింది.
నిజానికి నరేష్ హీరోగా సక్సెస్ అవుతాడని ఎవరూ అనుకోలేదు. అనూహ్యంగా అతడిలో కామెడీకి ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడంతో? నరేష్ కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. రాజేష్ కెరీర్ ని నటుడిగా ముగిస్తే...నరేష్ మాత్రం అంతకంతకు హైట్స్ కి చేరుకుంటున్నాడు. అయితే రాజేష్ మళ్లీ రెండేళ్ల క్రితం `హలో వరల్డ్` అనే వెబ్ సిరీస్ లో నటించాడు. దీంతో మళ్లీ నటుడిగా టాలీవుడ్ కి కంబ్యాక్ అవుతాడనుకున్నారు? కానీ అక్కడ ఎలాంటి ప్రయత్నాలు చేసినట్లు కనిపించలేదు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజేష్ కి ...నరేష్ ఓ మంచి సలహా ఇచ్చాడు. అన్నయ్యని విలన్ గా ట్రై చేయమని చెప్పాడు. టాలీవుడ్ లో విలన్లు లేరు. ప్రతి నాయకుడి పాత్రకు తీసుకోవాలంటే బాలీవుడ్ కి వెళ్లాల్సి వస్తుంది. తన లాంటి వాళ్లు విలన్ గా టర్నింగ్ తీసుకుంటే మన దర్శకులు అంత దూరం వెళ్లే అవసరం తగ్గుతుందని సలహా ఇచ్చారు. ఇండస్ట్రీలో తన అనుభవంతో ఓ సలహాగా చెప్పినట్లు నరేష్ తెలిపారు.
అయితే రాజేష్ మాత్రం తమ్ముడి సలహాని లైట్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఇంత వరకూ రాజేష్ ఆ రకమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించలేదు. అలాగే హీరో అవ్వాలంటే గ్లామర్ తో మాత్రమే సాధ్యం కాదన్నారు. అలాగైతే నా కంటే మా అన్నయ్య అందంగా ఉంటాడు. ఎందుకు హీరో అవ్వలేకపోడు. రజనీకాంత్- అరవింద్ స్వామి మధ్య వత్యాసాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇండస్ట్రీకి కొందరు కనెక్ట్ అవుతారని...మరికొంత మంది కనెక్ట్ అవ్వరని అన్నారు.