హార్రర్ థ్రిల్లర్ తో వస్తోన్న నరేష్.. టీజర్ చూశారా?
బచ్చలమల్లి సినిమాతో ఆఖరిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన అల్లరి నరేష్ ఇప్పుడు మరోసారి తన జానర్ ను మార్చాడు.
By: Tupaki Desk | 18 March 2025 10:07 AM ISTకామెడీ సినిమాలతో ఎంతో ఫేమస్ అయిన అల్లరి నరేష్ గత కొన్ని సినిమాలుగా తన రూట్ మార్చి డిఫరెంట్ డిఫరెంట్ జానర్లలో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. బచ్చలమల్లి సినిమాతో ఆఖరిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన అల్లరి నరేష్ ఇప్పుడు మరోసారి తన జానర్ ను మార్చాడు. తాజాగా నరేష్ నటిస్తున్న కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది.
నరేష్ నటిస్తోన్న కొత్త సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ దానికి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. నాని కాసరగడ్డ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 12ఎ రైల్వే కాలనీ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. పొలిమేర ఫ్రాంచైజ్ సినిమాలకు వర్క్ చేసిన రైటర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథను అందించారు.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస్ చిట్టూరి నిర్మించిన ఈ సినిమా హార్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. టీజర్ చూడగానే సినిమా ఉత్కంఠభరితంగా మరియు థ్రిల్లింగ్ గా ఉండబోతుందని తెలుస్తోంది. అల్లరి నరేషన్ తో ప్రారంభమైన ఈ టీజర్ లో అతని లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్ అందరినీ కట్టిపడేశాయి.
ఈ ఆత్మలు కొంతమందికే ఎందుకు కనిపిస్తాయి. అందరికీ ఎందుకు కనిపించవు అంటూ వైవా హర్ష ఇచ్చిన వాయిస్ ఓవర్ సినిమాపై మరింత ఉత్కంఠ పెంచేలా ఉంది. అంతేకాదు సినిమాలోని ఒక్కొక్క పాత్రను టీజర్ లో పరిచయం చేసిన విధాన కూడా బావుంది. తన కెరీర్లో మునుపెన్నడూ చేయని పాత్రను అల్లరి నరేష్ ఈ సినిమాలో చేస్తున్నాడు.
పొలిమేర సినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న కామాక్షి భాస్కర్ల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఖుషేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో అందించిన బీజీఎం టీజర్ ను మరింత ఎలివేట్ అయ్యేలా చేసింది. మరిన్ని ట్విస్టులతో 12ఎ రైల్వే కాలనీ సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతుంది.