Begin typing your search above and press return to search.

హర్షసాయి కేసులో మత్తుమందు, బ్లాక్మెయిల్ ఆరోపణలు!

ఆమెతో వివాదం కేవలం వ్యక్తిగతంగా కాకుండా, సినిమాకు కూడా సంబంధం ఉన్నట్లు వివరాలు బయటకు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   25 Sep 2024 9:34 AM GMT
హర్షసాయి కేసులో మత్తుమందు, బ్లాక్మెయిల్ ఆరోపణలు!
X

హర్షసాయి పై నమోదైన అత్యాచారం కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితురాలు చేసిన ఫిర్యాదులో, హర్షసాయి తనకు మత్తుమందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడని, ఆ తర్వాత తన వ్యక్తిగత వీడియోలను తీసి బ్లాక్మెయిల్ చేశాడని ఆరోపించింది. ఆమెతో వివాదం కేవలం వ్యక్తిగతంగా కాకుండా, సినిమాకు కూడా సంబంధం ఉన్నట్లు వివరాలు బయటకు వస్తున్నాయి.

బాధితురాలు చేసిన ఫిర్యాదులో, హర్షసాయి ప్రస్తుతం హీరోగా నటిస్తున్న 'మెగా' సినిమా కాపీరైట్స్ కోసం పట్టుబట్టినట్లు తెలిపింది. ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో హర్షసాయి కాపీరైట్స్ తనకి ఇవ్వాలని, లేదంటే తీసిన వీడియోలను వైరల్ చేస్తానని బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది. కాపీరైట్స్ విషయంలో ఒత్తిడి పెట్టడమే కాకుండా, తనపై మానసికంగా, శారీరకంగా హర్షసాయి అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

హర్షసాయి ప్రస్తుతం యూట్యూబర్ గా ప్రజల మధ్య మంచి పేరును సంపాదించుకున్నాడు. సామాజిక సేవలతో పాటు పలు సార్లు ఆర్థికంగా పేద ప్రజలకు సహాయం చేశాడు. కానీ, ఈ ఆరోపణల కారణంగా అతని పేరు మసకబారిపోయే పరిస్థితి తలెత్తింది. మరోవైపు, బాధితురాలు చేసిన ఆరోపణలు చాలా సీరియస్ గా ఉన్నాయి. హర్షసాయి తనపై చేసిన ఈ కిరాతక చర్యలను సహించలేక, చివరికి చట్టపరంగా న్యాయం కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొంది.

ప్రస్తుతం ఈ కేసులో హైదరాబాద్ పోలీసులు హర్షసాయి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. న్యాయ విచారణ ఇంకా ప్రారంభమవకముందే ఈ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి రావడం కేసును మరింత క్లిష్టం చేస్తోంది. హర్షసాయి ఈ కేసులో తన వివరణ పై క్లారిటీ ఇవ్వక ముందే, సోషల్ మీడియాలో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది.

అయితే బాధిత మహిళ హర్ష సాయి తనకు 2 కోట్ల వరకు ఇవ్వాలని కూడా పలు ఆరోపణలు చేసింది. హర్షసాయి మాత్రం ఈ వివాదంలో తన తప్పు ఏమి లేదని ఇప్పటికే ఇన్ స్టా గ్రామ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా వివరణ ఇచ్చారు. కావాలనే తనపై ఆమె ఆరోపణలు చేస్తోందని డబ్బు తీసుకోవాలని ఆమె ప్లాన్ అంటూ హర్షసాయి తన వివరణ ఇచ్చారు. మరి ఈ వివాదంలో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చోసుకుంటాయో చూడాలి.