Begin typing your search above and press return to search.

వ‌ర్మ‌పై కూట‌మి అభిమానులు ఎటాకింగ్!

అవి వివాదం అవ్వ‌డం..వాటిపై ఆ ముగ్గురు త‌రుపున మ‌రొక‌రు కౌంట‌ర్ వేయ‌డం జ‌రిగింది.

By:  Tupaki Desk   |   5 Jun 2024 9:23 AM GMT
వ‌ర్మ‌పై కూట‌మి అభిమానులు ఎటాకింగ్!
X

సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ శైలి గురించి తెలిసిందే. తాను ఏది అనుకుంటే? అది సినిమా ద్వారా చెప్పేసేవారు. వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా ఎన్నో సినిమాలు చేసారు. ఎన్నో బ‌యోపిక్ ల్ని తెర‌కెక్కించారు. చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్, లోకేష్ ల‌ను సైతం ఉద్దేశించి కూడా సినిమాలు చేసారు. ఇక వ్య‌క్తిగ‌తంగా ఆ ముగ్గుర్ని ఉద్దేశించి సోష‌ల్ మీడియా వేదిక‌గా వ‌ర్మ చేసిన పోస్టులు సైతం అంతే ఆస‌క్తిక‌రం. అవి వివాదం అవ్వ‌డం..వాటిపై ఆ ముగ్గురు త‌రుపున మ‌రొక‌రు కౌంట‌ర్ వేయ‌డం జ‌రిగింది.

అలాగే ఆ ముగ్గురు ఫోటోల్ని సైతం మార్పింగ్ చేసిన వీడియోల్ని కూడా పోస్ట్ చేసేవారు. వైకాపా అధికారంలో ఉన్నా..లేక‌పోయినా వ‌ర్మ ఈ ప‌ని నిరంత‌రం చేస్తూనే ఉండేవారు. మ‌రి ఇవ‌న్నీ లోకేష్ రెడ్ బుక్ లో నోట్ అయ్యాయా? లేదా? అన్న‌ది తెలియాల్సిన అంశం. ఇప్పుడు ఏపీలో కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. మ‌రి లోకేష్ ప్ర‌చార స‌మ‌యంలో త‌మ‌ని ఇబ్బంది పెట్టిన వాళ్లను ఎవ్వ‌ర్నీ వ‌దిలిపెట్ట‌మ‌ని..అంద‌రికీ బ‌ధులిచ్చి తీరుతామ‌ని కాస్త గ‌ట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.

గెలిచిన త‌ర్వాత కూడా ఇదే మాట‌ని మ‌రోసారి ఉద్ఘాటించారు.అయితే అంత‌కు ముందు వ‌ర్మ సోష‌ల్ మీడియాలో త్రిముఖ పోరును ఎదుర్కంటున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు, చంద్ర‌బాబు నాయుడు అభిమానులు..లోకేష్ అభిమానులు అంతా క‌లిసి సోష‌ల్ మీడియాలో ఎటాకింగ్ దిగారు. ఇంత‌కాలం ఏం చేసినా చెల్లినా ఇక చెల్ల‌వ్ అంటూ ముగ్గురు ఉద్దండుల అభిమానులు వ‌ర్మ‌ని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఇష్టానుసారం దూష‌ణ‌ల‌తో వ‌ర్మ పైకి వెళ్తున్నారు. మ‌రి వ‌ర్మ వీటికి ఏ విధంగా బ‌ధులిస్తారు? అన్న‌ది చూడాలి.

ఇలాంటి ఎటాక్ లు వ‌ర్మ‌కి కొత్తేం కాదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు ల‌క్ష‌ల మంది దాడి చేసినా నిలువ‌రించిన సంద‌ర్భాలెన్నో. వ‌ర్మ ఆఫీస్ ముందు అభిమానులు ఆందోళ‌న‌లు చేసిన సంద‌ర్భాలెన్నో. ఇప్పుడు ప‌వ‌న్ అభిమానులకు తోడుగా టీడీపీ బ్యాచ్ కూడా తోడ‌వ్వ‌డంతో ఎటాకింగ్ మరింత స్ట్రాంగ్ గా క‌నిపిస్తుంది. మ‌రి వ‌ర్మ వీటీకి ఎలాంటి ముగింపు ప‌లుకుతారో చూడాలి. అలాగే గెలిచిన సంద్భంగా చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, లోకేష్ ల‌కు ప్ర‌త్యేకంగా త‌న త‌రుపున విషెస్ తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే.