Begin typing your search above and press return to search.

ఇన్నాళ్లకు అది బయట పెట్టిన ఇల్లి బేబ్..!

బాలీవుడ్ లో ఆశించిన స్థాయి క్రేజ్ తెచ్చుకోవడంలో విఫలమైన ఇలియానా ఆ తర్వాత పెద్దగా సినిమా ఛాన్స్ లను అందుకోలేదు.

By:  Tupaki Desk   |   5 Jan 2024 1:30 PM GMT
ఇన్నాళ్లకు అది బయట పెట్టిన ఇల్లి బేబ్..!
X

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా అప్పటి స్టార్స్ అందరితో నటించి మెప్పించింది. పోకిరి, మున్నా, శక్తి ఈ సినిమాల టైం లో ఇలియానాకు ఒక సెపరేట్ ఫ్యాన్స్ ఉండేవారు. స్లిం లుక్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కాజేసింది అమ్మడు. అయితే సౌత్ లో కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లో నార్త్ నుంచి ఆఫర్ రాగానే అక్కడకు షిఫ్ట్ అయ్యింది. బాలీవుడ్ లో ఆశించిన స్థాయి క్రేజ్ తెచ్చుకోవడంలో విఫలమైన ఇలియానా ఆ తర్వాత పెద్దగా సినిమా ఛాన్స్ లను అందుకోలేదు.

సౌత్ సినిమాలకు దూరమైన ఈ అమ్మడు ఇక్కడ కూడా అవకాశాలు రాబట్టుకోలేదు. ఇక ఇదే టైం లో తన పర్సనల్ లైఫ్ మీద దృష్టి పెట్టిన ఇలియానా కొన్నాళ్లు ఒకరితో ప్రేమాయణం నడిపించి అతనికి దూరమైంది. ఆ తర్వాత ఏకంగా ప్రెగ్నెన్సీ తో షాక్ ఇచ్చింది. ప్రెగ్నెన్సీ ఫోటోలను షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్న ఇలియానా భర్త గురించి మాత్రం వివరాలను వెల్లడించలేదు.

లాస్ట్ ఇయర్ ఇలియానా ఒక బాబుకి జన్మనిచ్చింది. కొడుకు పేరు కోవా ఫీనిక్స్ డోలన్ అని కూడా అనౌన్స్ చేసింది. బాబుతో తన లైఫ్ చాలా అందంగా ఉందంటూ తన అప్డేట్స్ తో సోషల్ మీడియా ఫ్యాన్స్ ని అలరిస్తుంది ఇలియానా. అయితే తన భర్త గురించి మాత్రం ఇప్పటికీ సీక్రెట్ గా ఉంచుతుంది. రీసెంట్ గా తన భర్త ఫోటోలను షేర్ చేస్తూ అతడి పేరుని మైఖెల్ డోలన్ అని చెప్పింది. పేరు చెప్పింది కానీ ఆ తర్వాత అతని గురించి మిగతా డీటైల్స్ చెప్పలేదు.

లేటెస్ట్ గా ఇలియానా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త గురించి అతని పై కొందరు చేసిన కామెంట్స్ గురించి ప్రస్తావించింది ఇలియానా. తన జీవితంలోకి మైఖెల్ వచ్చినందుకు తాను ఎప్పుడూ సంతోషంగా ఉన్నాను.. అతను ఒక అద్భుతమైన భాగస్వామి అని చెప్పుకొచ్చింది ఇలియానా. ఆఫ్టర్ డెలివరీ డిప్రెషన్ ఉంటుంది. అది ఏంటన్నది తనకు అప్పుడు అర్థమైంది. ఆ టైం లో తన ఇంట్లో వారు మంచి సపోర్ట్ గా నిలిచారని చెప్పింది ఇలియానా. డాక్టర్స్ కూడా తనని బాబుని బాగా చూసుకున్నారని అన్నది ఇలియానా. ఆ టైం లో మైఖెల్ తనకు తోడుగా ఉన్నాడు. బాబుని తనే జాగ్రత్తగా చూసుకున్నాడని అన్నది ఇలియానా.

నా జీవితంలోకి మైఖెల్ రావడం ఒక అదృష్టం. తను నాకోసం ఏమి చెప్పకుండానే అన్నీ చేస్తాడు. తను ఒక అద్భుతమైన భాగస్వామి అని అందుకు తాను కృతజ్ఞురాలిని అంటూ చెప్పుకొచ్చింది ఇలియానా. తన భర్త గురించి జనాలు చాలా చెడుగా మాట్లాడారు. మైఖెల్ ని మ్యారేజ్ చేసుకున్నారా ఇలాంటివన్ని తనని బాధ పెట్టాయని.. భర్త, పెళ్లి గురించి అన్ని విషయాలు చెప్పాలని ఉన్నా తనకు నచ్చిన వారి గురించి అందరు ఇలా చెడుగా మాట్లాడటం తనకు నచ్చలేదని మైఖెల్ మీద తన ప్రేమను చూపిస్తూ ఎమోషనల్ అయ్యింది ఇలియానా.