బన్నీ డ్యాన్స్‌కు కారణం ఆమే: అల్లు అరవింద్
దీంతో ఆ రెండు ఫ్యామిలీలకు సంబంధించి ఎవరేం మాట్లాడినా మరొక ఫ్యామిలీ ఫ్యాన్స్ దాన్ని భూతద్దంలో పెట్టి మరీ తప్పులను వెతుకుతున్నారు
By: Tupaki Desk | 7 Feb 2025 11:15 AM GMTసినీ ఇండస్ట్రీలో అందరూ బాగానే ఉంటారు. కానీ బయట అభిమానులే ఒకరంటే ఒకరికి పడకుండా అనవసరమైన గొడవలు పెట్టుకుంటూ మనశ్శాంతి లేకుండా చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య శత్రువులను మించిన వార్ జరుగుతుంది. ఆ రెండు ఫ్యామిలీల మధ్య లేని విబేధాలను సృష్టిస్తూ వాళ్లలో వాళ్లే కొట్టుకుంటున్నారు.
దీంతో ఆ రెండు ఫ్యామిలీలకు సంబంధించి ఎవరేం మాట్లాడినా మరొక ఫ్యామిలీ ఫ్యాన్స్ దాన్ని భూతద్దంలో పెట్టి మరీ తప్పులను వెతుకుతున్నారు. టాలీవుడ్ లో ఎవరికైనా డ్యాన్స్ అనగానే మొదట గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవే. ఎవరు ఎంత బాగా డ్యాన్స్ వేసినా మెగాస్టార్ గ్రేస్ ఎవరికీ రాదని అంటూ ఉంటారు.
అయితే చిరంజీవి ఫ్యామిలీ కావడంతో రామ్ చరణ్, అల్లు అర్జున్‌కు మెగాస్టార్ డ్యాన్సే వచ్చిందని అందరూ అంటుంటారు. కానీ తాజాగా తండేల్ ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ బన్నీ డ్యాన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ప్రెస్ మీట్ లో భాగంగా అరవింద్ ను డ్యాన్స్ చేయమని యాంకర్ అడిగింది.
దానికి అరవింద్ బదులిస్తూ, తనకు డ్యాన్స్ అసలు రాదని, ఏదో మంచి మ్యూజిక్, సాంగ్ ప్లే అవుతుంటే కాలు కదిలిస్తాను తప్పించి నాకసలు డ్యాన్స్ రాదు. మా అబ్బాయి డ్యాన్స్ నాదనుకున్నారేమో. దానికి కారణం వేరే. వాళ్ల అమ్మ నుంచి బన్నీకి ఆ డ్యాన్స్ వచ్చిందని, బన్నీ వాళ్ల అమ్మ మంచి డ్యాన్సర్ అని వెల్లడించాడు.
ఈ కామెంట్స్ విన్నాక బన్నీ డ్యాన్స్ వెనుక చిరంజీవి ప్రమేయం లేదా అని కొందరంటుంటే, చిరూ వల్లే బన్నీ అంత గొప్ప డ్యాన్సర్ కాలేదనే విషయాన్ని అరవింద్ ఇన్‌డైరెక్ట్ గా చెప్తున్నాడని మరికొంతమంది మెగా ఫ్యాన్స్ అంటున్నారు. కానీ అల్లు ఫ్యాన్స్ మాత్రం కొడుక్కి తల్లి డ్యాన్స్ వచ్చిందనే ఉద్దేశంలోనే అరవింద్ ఆ మాట అన్నాడని ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు.