Begin typing your search above and press return to search.

అల్లు అరవింద్ 'నో కామెంట్స్'.. వార్ ఇంకా పెరుగుతున్నట్లు ఉందే!

ఇప్పుడు అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

By:  Tupaki Desk   |   7 Feb 2025 6:04 AM GMT
అల్లు అరవింద్ నో కామెంట్స్.. వార్ ఇంకా పెరుగుతున్నట్లు ఉందే!
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ కుటుంబాలు మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య ఏదో వైరం ఉందని ఒకప్పుడు వార్తలు వచ్చేవి. వాటిని పలుమార్లు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ తోసిపుచ్చారు. కానీ ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన ఫ్రెండ్, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రచారం చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఆ ఘటనతో ఒక్కసారిగా రెండు కుటుంబాల ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. పరస్పరం దారుణంగా విమర్శలు చేసుకోవడం.. ట్వీట్స్ పెట్టుకోవడం.. అదంతా తెలిసిందే. ఆ తర్వాత పుష్ప 2 సినిమా ప్రీమియర్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు.

ఆ సమయంలో అల్లు అరవింద్ ఇంటికి మెగా ఫ్యామిలీ రావడంతో.. సాన్నిహిత్యం బయటకు వచ్చింది. కానీ రామ్ చరణ్ వెళ్లలేదని అప్పట్లో టాక్ వినిపించింది. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య కొన్ని మిక్స్‌ డ్ రియాక్షన్ సీన్లు జరుగుతుండగా.. ఇప్పుడు అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

అల్లు అరవింద్ సమర్పణలో తండేల్ మూవీ రూపొంది నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఓ రేంజ్ లో ప్రమోషన్స్ నిర్వహించారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఈవెంట్స్ లో పాల్గొన్నారు. ఆ సమయంలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ఫలితం గురించి పరోక్షంగా మాట్లాడారు!

ఆ తర్వాత మరో ఇంటర్వ్యూలో తన మేనల్లుడి డెబ్యూ మూవీ సరిగ్గా ఆడలేదని, బిలో యావరేజ్ అంటూ చిరుత సినిమా కోసం మాట్లాడారు. అందుకే రెండో సినిమాతో హిట్ ఇవ్వాలని మగధీర తీశానని తెలిపారు. అంతే కాకుండా.. నష్టపోతానని అనుకున్నానని, కానీ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిందని చెప్పారు.

దీంతో చిరుత బిలో యావరేజ్ అన్న మాటను మెగా ఫ్యాన్స్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆ మూవీ మంచి విజయం సాధించింది. డెబ్యూ హీరోగా రామ్ చరణ్ హైయెస్ట్ వసూళ్లు రాబట్టారు. దీంతో ఆ సినిమా ఫ్లాప్ అనడమేంటని డిస్కస్ చేసుకుంటున్నారు. అదే సమయంలో ఫైర్ అవుతూ ట్రోల్స్ చేస్తున్నారు.

ఆ విషయంపై తండేల్ ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ ను అడగ్గా.. తాను స్పందించనని తెలిపారు. నో కామెంట్స్ అన్నారు. ట్రోలింగ్ తన దృష్టికి వచ్చిందని, గమనిస్తున్నానని తెలిపారు. కానీ కామెంట్ చేయనని అన్నారు. దీంతో ఆయన ప్రశ్నను దాటవేయడంతో ఇప్పుడు మళ్లీ చర్చ జరుగుతోంది.

దీంతో ఉద్దేశపూర్వకంగానే చిరుత మూవీ కోసం అల్లు అరవింద్ ఆలా అన్నట్లు ఉన్నారని మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. వాటికి అల్లు అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు. అలా రెండు కుటుంబాల ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం మరింత పెరుగుతూనే ఉంది.