Begin typing your search above and press return to search.

చరణ్ హిట్టు సినిమా.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. తండేల్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   6 Feb 2025 1:02 PM GMT
చరణ్ హిట్టు సినిమా.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్!
X

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. తండేల్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఆ మూవీ.. మరికొద్ది గంటల్లో రిలీజ్ కానుంది. దీంతో అల్లు అరవింద్.. సినిమా కోసం ఓ రేంజ్ లో ప్రమోషన్స్ నిర్వహించారు. ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ తో బిజీగా గడిపారు.

అయితే ఇండస్ట్రీలో చాలా బ్యాలెన్స్ డ్ గా ఉంటారని, ఆచి తూచి మాట్లాడుతుంటారనే పేరు ఆయనకు ఉంది. కానీ రీసెంట్ గా ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. చెప్పాలంటే.. మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం ఎక్కువైంది! మరి అర‌వింద్ ఎందుకు అలా చేస్తున్నారో తెలియదు కానీ.. చర్చ మాత్రం నడుస్తుంది.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చరణ్ తొలి సినిమా చాలా యావరేజ్‌ గా ఆడిందంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చరణ్ డెబ్యూ మూవీ బిలో యావరేజ్ అని, అందుకే మేనల్లుడికి పెద్ద హిట్ ఇవ్వాలనుకున్నానని తెలిపారు. అది చ‌ర‌ణ్ పై త‌న‌కున్న ప్రేమ‌ను వ్యక్తపరిచారో.. లేక ఎందుకు అలా అన్నారో తెలియదు కానీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

ఎందుకంటే.. చిరుత బిలో యావరేజ్ మూవీ అస్సలు కాదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. హిట్ మూవీ అనే చెప్పాలి. రూ.9 కోట్లతో రూపొందిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ.25 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. అనేక చోట్ల 100 రోజులు ఆడింది. అప్పట్లో అది ఒక రికార్డే.

ఒక హీరో డెబ్యూ మూవీ.. ఆ స్థాయిలో మెప్పించందంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. అలాంటప్పుడు చిరుత మూవీ బిలో యావరేజ్ గా అల్లు అరవింద్ వర్ణించడం.. ఎవరికీ అర్థం కాని విషయం. ఆయన తీసిన మగధీర అంత హిట్ కాకపోయినా.. చిరుత కూడా హిట్టే. భారీ వసూళ్లను రాబట్టింది కాబట్టి..

దీంతో అల్లు అరవింద్.. చిరుత కోసం అలా ఎందుకు కామెంట్ చేశారోని అంతా మాట్లాడుకుంటున్నారు. అసలే కొంత కాలంగా మెగా, అల్లు అభిమానుల మధ్య ఎలాంటి వార్ జరుగుతుందో తెలిసిందే. అలాంటి సమయంలో అల్లు అరవింద్ వ్యాఖ్యలు వల్ల మరింత చిచ్చు రేగే అవకాశం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఆ విషయాన్ని ఆయన గ్రహించాలని సూచిస్తున్నారు. మరి దీనిపై అల్లు అరవింద్ స్పందిస్తారేమో వేచి చూడాలి.