Begin typing your search above and press return to search.

తండేల్‌ : అల్లు అరవింద్‌ చాలా పెద్ద మాట!

అదే కార్యక్రమంలో అల్లు అరవింద్‌ మాట్లాడుతూ తండేల్‌ సినిమా కచ్చితంగా సూపర్ హిట్‌ అవుతుందనే నమ్మకంను వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   24 Jan 2025 5:23 AM GMT
తండేల్‌ : అల్లు అరవింద్‌ చాలా పెద్ద మాట!
X

నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన తండేల్‌ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యింది. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా మూడో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. మూడో పాట విడుదల కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ పాల్గొన్నారు. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నాడు. గతంలో అల్లు అరవింద్‌ బ్యానర్‌లో నాగ చైతన్య హీరోగా నటించిన 100% లవ్‌ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కనుక సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పాట విడుదల కార్యక్రమంలో అల్లు అరవింద్‌ సినిమాపై చాలా నమ్మకంగా కనిపించారు. ఇప్పటికే ఆయన సినిమాను చూసినట్లుగా ఉన్నారు. అందుకే కాన్ఫిడెన్స్‌తో ఏకంగా స్టేజ్‌పై స్టెప్పులు వేశారు. పాటకు స్టూడెంట్స్‌తో కలిసి అల్లు అరవింద్‌ వేసిన స్టెప్పులు వైరల్‌ అవుతున్నాయి. అదే కార్యక్రమంలో అల్లు అరవింద్‌ మాట్లాడుతూ తండేల్‌ సినిమా కచ్చితంగా సూపర్ హిట్‌ అవుతుందనే నమ్మకంను వ్యక్తం చేశారు. ముఖ్యంగా నాగ చైతన్య గురించి మాట్లాడుతూ ఈ సినిమా కోసం చైతూ చాలా కష్టపడ్డాడు అన్నారు. అంతే కాకుండా చైతూ కెరీర్‌ బెస్ట్‌ నటనను ఈ సినిమాలో చూస్తారని అల్లు అరవింద్‌ చాలా నమ్మకంగా చెప్పుకొచ్చారు.

ఇక నాగ చైతన్య కెరీర్‌ బెస్ట్‌ వసూళ్లు ఈ సినిమాకు నమోదు కాబోతున్నట్లుగా కూడా అల్లు అరవింద్‌ చెప్పుకొచ్చారు. ఈమధ్య కాలంలో నాగ చైతన్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుస్తూ వస్తున్నాయి. కనుక ఈ సినిమాపై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో అల్లు అరవింద్‌ చెప్పిన ఈ మాటలను ఫ్యాన్స్ సీరియస్‌గా పరిగణలోకి తీసుకుంటున్నారు. కచ్చితంగా చైతూకి ఈ సినిమా సూపర్‌ హిట్‌ను ఇస్తుందని వారు సైతం నమ్ముతున్నారు. అల్లు అరవింద్‌ వంటి పెద్ద నిర్మాత అంత ఈజీగా అలాంటి మాటలు మాట్లాడరు. ఆయన నుంచి ఆ వ్యాఖ్యలు వచ్చాయి అంటే కచ్చితంగా మ్యాటర్‌ ఉండి ఉంటుందని అంటున్నారు.

నాగ చైతన్య, సాయి పల్లవి కాంబోలో వచ్చిన లవ్‌ స్టోరీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా సాయి పల్లవి లుక్‌, ఆమె నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అంటూ మేకర్స్‌ చెబుతున్నారు. అంతే కాకుండా సినిమాలోని ఆమె లుక్‌కి ఇప్పటికే ప్యాన్స్ ఫిదా అయ్యారు. బుజ్జితల్లి పాట వచ్చిన తర్వాత సినిమా గురించి ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ ఆడియన్స్‌ చూసే విధంగా ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి రూపొందించాడు. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది.