రిలీజ్ ముందే ధైర్యంగా చెప్పా : అల్లు అరవింద్
నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన తండేల్ సినిమా సక్సెస్ ఈవెంట్ లో నిర్మాత అల్లు అరవింద్ తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు.
By: Tupaki Desk | 12 Feb 2025 3:20 AM GMTనాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన తండేల్ సినిమా సక్సెస్ ఈవెంట్ లో నిర్మాత అల్లు అరవింద్ తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. సినిమా సక్సెస్ లో ఎవరెంత చేసినా అది దర్శకుడి మైండ్ లో ఆలోచన. అందుకే మొదటి క్రెడిట్ అతనికే దక్కుతుందని అన్నారు అల్లు అరవింద్. డైరెక్టర్ చందు ఈ సినిమాను అద్భుతంగా తీశాడు. మా బ్యానర్ లో కలకాలం నిలిచిపోయే సినిమాల్లో ఇది ఒకటని అన్నారు అల్లు అరవింద్.
సినిమాలో నటించిన సాయి పల్లవికి థాంక్స్. నువ్వు ఈ ఫంక్షన్ లో ఉండాల్సిందని అన్నారు. మా యూనిట్ ని బ్లెస్ చేయడానికి వచ్చిన నాగార్జున గారికి థాంక్స్ చెప్పారు అల్లు అరవింద్. ఇక స్పీచ్ లో భాగంగా నాగ చైతన్య పర్ఫార్మెన్స్ గురించి ఎడిట్ రూం లోనే చూసి అద్భుతంగా ఫీల్ అయ్యానని అన్నారు. అందుకే రిలీజ్ ముందు ప్రమోషన్స్ లో తన కెరీర్ ని మరో ఎత్తుకి తీసుకెళ్తుందని ముందే చెప్పానని గుర్తు చేశారు అల్లు అరవింద్.
ముఖ్యంగా వెడ్డింగ్ కార్డ్ సీన్ అద్భుతం.. ఈ సినిమా పూరయ్యే వరకు మరో సినిమా గురించి ఆలోచించకుండా ఉన్నాడని అన్నారు. దేవి చిన్నప్పటి నుంచి తెలుసు.. సినిమాని ప్రేమించి బీజీఎం ఇస్తాడు.. అందుకే సినిమా అంత బాగా వచ్చింది. ఇక సినిమాకు పనిచేసిన వారందరికీ థాంక్స్ అని అన్నారు అల్లు అరవింద్.