అల్లు అరవింద్ నోట మెగా అభిమానుల మాట..!
ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ ఈవెంట్ కి చరణ్ ఒక అతిథిగా రాగా మరో స్పెషల్ గెస్ట్ గా అల్లు అరవింద్ వచ్చారు.
By: Tupaki Desk | 13 Dec 2024 3:55 AM GMTసాయి దుర్గ తేజ్ హీరోగా రోహిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సంబరాల ఏటిగట్టు. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ ఈవెంట్ కి చరణ్ ఒక అతిథిగా రాగా మరో స్పెషల్ గెస్ట్ గా అల్లు అరవింద్ వచ్చారు. చరణ్ ముందు స్పీచ్ ఇచ్చి వెళ్లగా అల్లు అరవింద్ తర్వాత స్పీచ్ ఇచ్చారు. ఇక మైక్ అందుకున్న అల్లు అరవింద్ ఈవెంట్ కి వచ్చిన మెగా అభిమానులకు, పవర్ స్టార్ అభిమానులకు, మెగా పవర్ స్టార్ అభిమానులకు, సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ అభిమానులకు అందరికీ అభినందనలు తెలిపారు అల్లు అరవింద్.
సంబరాల ఏటిగట్టు ఈ సినిమా విజువల్స్ చూస్తుంటే.. ఒళ్లు గగుర్పొడిచేస్తున్నాయి.. ఏంటి తేజ్ ఎప్పుడు ఈ బాడీ పెంచాడు తెలియకుండా చేశాడని అన్నారు అల్లు అరవింద్. ఈ సినిమా నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి.. రోహిత్ కెపి అందరిని అప్రిషియేట్ చేస్తున్నా అన్నారు. ఐశ్వర్య లక్ష్మి గురించి చెబుతూ ఆల్రెడీ మీరు గ్రేట్ యాక్ట్రెస్ అని అన్నారు.
తేజ్ ఫోన్ చేసి మామ 10 ఇయర్స్ అయ్యింది ఫంక్షన్ కి నువ్వు రావాలి అన్నాడు. ఏంటి అప్పుడే 10 ఇయర్స్ అయ్యిందా అనుకున్నా.. ఫస్ట్ సినిమాకు నేను ఛాన్స్ ఇచ్చినట్టు ఉంది. కానీ ఈ పదేళ్లు కెరీర్ చూశాక ఫస్ట్ సినిమా తీయడానికి నాకు అవకాశం ఇచ్చినట్టు ఉందని అన్నారు అల్లు అరవింద్. మా విజయ దుర్గ అదృష్టవంతురాలు.. తన పేరులో కూడా అమ్మ పేరు పెట్టుకున్న ఇలాంటి కొడుకు దొరకడు అన్నారు.
తేజ్ ఆల్రెడీ ఒక మృత్యుంజయుడు.. అతనికి కలకాలం ఈ విజయాలు వరిస్తూ ముందుకెళ్లాలని.. ఇవాళ ముఖ్య అతిథిగా వచ్చిన మా మగధీరుడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కూడా విజయవంతం అవ్వాలని.. తేజ్ కి ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాలని కోరుతున్నా అని స్పీచ్ ముగించారు అల్లు అరవింద్.
ఐతే అల్లు అరవింద్ నోట మెగా అభిమానులకు, పవర్ స్టార్ అభిమానులకు అంటూ రావడం ఆయన కూడా ఆ మాటలు గట్టిగా చెప్పడం నిజంగానే ఫ్యాన్స్ లో జోష్ నింపింది. అల్లు అరవింద్ స్పీచ్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. చరణ్ గేమ్ ఛేంజర్ కి అల్లు అరవింద్ విషెస్ అందించడం తో మెగా ఫ్యాన్స్ అల్లు అరవింద్ స్పీచ్ ని లైక్ చేస్తున్నారు.