Begin typing your search above and press return to search.

థమ్స్ అప్ అనేసిన స్టార్స్ వీళ్లే.. అల్లు అర్జున్ ప్రత్యేకం ఎందుకంటే..?

పుష్ప బ్రాండ్ ఇమేజ్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు.

By:  Tupaki Desk   |   26 Nov 2024 5:07 AM GMT
థమ్స్ అప్ అనేసిన స్టార్స్ వీళ్లే.. అల్లు అర్జున్ ప్రత్యేకం ఎందుకంటే..?
X

పుష్ప బ్రాండ్ ఇమేజ్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇదే పాపులారిటీతో పలు వాణిజ్య సంస్థల నుంచి కూడా బ్రాండింగ్ తెచ్చుకుంటున్నాడు. సౌత్ లో వాణిజ్య ప్రకటనల్లో మహేష్, అల్లు అర్జున్ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారు. ముఖ్యంగా శీతల పానీయాలలో ఈ పోటీ రసవత్తరంగా సాగుతుంది. ఐతే లేటెస్ట్ గా అల్లు అర్జున్ ప్రముఖ శీతల పానీయం అదే కూల్ డ్రింక్ థమ్స్ అప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేశారు. దీనికి సంబందించిన యాడ్ కూడా రిలీజైంది.

ఐతే థమ్స్ అప్ కి బ్రాండింగ్ అంటే టాప్ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్నట్టే లెక్క అనే టాక్ ఉంది. ఇదివరకు పాన్ ఇండియా లెవెల్ లో చాలామంది స్టార్స్ థమ్స్ అప్ కి బ్రాండింగ్ చేశారు. ఫస్ట్ నేషనల్ లెవెల్ లో షారుఖ్ ఖాన్ థమ్స్ అప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. బాలీవుడ్ బాద్షా ఒక రేంజ్ ఫాం కొనసాగిస్తున్న టైం లో దాదాపు చాలా ఏళ్లు ఆయన బ్రాండింగ్ చేశారు.

షారుఖ్ ఖాన్ తర్వాత యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్ కూడా థమ్స్ అప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ కూడా దాదాపు 8 ఏళ్లుగా థమ్స్ అప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగారు. ఐతే ఇదివరకు పాన్ ఇండియా మొత్తం ఒకరితోనే బ్రాండింగ్ చేయించే థమ్స్ అప్ తర్వాత సౌత్ ఇండియా వరకు ఒకరితో చేయించింది. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ థమ్స్ అప్ కి సౌత్ బ్రాండ్ చేశారు. దాదాపు థమ్స్ అప్ తో మహేష్ ప్రయాణం చాలా ఏళ్లు కొనసాగింది.

ఆ తర్వాత ఆ ఛాన్స్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ దక్కించుకున్నాడు. థమ్స్ అప్ తో విజయ్ రెండేళ్ల పాటు అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు విజయ్ ప్లేస్ లో అల్లు అర్జున్ థమ్స్ అప్ కి బ్రాండింగ్ చేస్తున్నాడు. ఐతే మహేష్, విజయ్ లా సౌత్ మొత్తమే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో అల్లు అర్జున్ థమ్స్ అప్ కి బ్రాండింగ్ చేస్తున్నాడు. పుష్ప రాజ్ మేనియాని వాడుకునేలా థమ్స్ అప్ అల్లు అర్జున్ ని బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ చేసింది.

మరి అల్లు అర్జున్ తో ఈ కాంట్రాక్ట్ ఎన్నాళ్లు ఉంటుందో తెలియదు కానీ ఏది ఏమైనా అల్లు అర్జున్ థమ్స్ అప్ బ్రాండింగ్ చేయడం అల్లు ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తుంది. ముఖ్యంగా పాన్ ఇండియా మొత్తం షారుఖ్, సల్మాన్, అక్షయ్ తర్వాత ఆ ఛాన్స్ అందుకోవడం నిజంగానే అతని స్టార్ డం ని తెలియచేస్తుంది.