Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ 'మ్యాటర్స్'.. ఇకపై అన్నీ అతని ద్వారానే!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రీసెంట్ గా పుష్ప 2: ది రూల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 Feb 2025 6:08 AM GMT
అల్లు అర్జున్ మ్యాటర్స్.. ఇకపై అన్నీ అతని ద్వారానే!
X

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రీసెంట్ గా పుష్ప 2: ది రూల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే. జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఆ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. నార్త్ టు సౌత్.. ఇండియాతో పాటు ఓవర్సీస్ బాక్సాఫీస్ ను కూడా షేక్ చేశారు.

ఎన్నో రికార్డులు.. మరెన్నో ఘనతలు.. బోలెడు వసూళ్లు.. పుష్ప-2 సొంతమనే చెప్పాలి. మొత్తానికి మూడేళ్ల పాటు సినిమా కోసం స్పెండ్ చేసిన బన్నీ.. అందుకు తగ్గ సరైన ప్రతిఫలం అందుకున్నారు. ఓవరాల్ గా ఐదేళ్లకు పైగా పుష్ప సిరీస్ చిత్రాల కోసం కేటాయించిన అల్లు అర్జున్.. ఇప్పుడు ఫ్రీ అయ్యారు. రీసెంట్ గా తన గడ్డం కూడా తీసేశారు.

డీసెంట్ లుక్ లోకి బన్నీ వచ్చేయగా.. ఆయన లుక్ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. అదే సమయంలో తన అప్ కమింగ్ మూవీ అప్డేట్స్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. పుష్ప సినిమాలతో అందరి దృష్టిని తమ కొత్త చిత్రాలపై పడేలా చేశారు. దీంతో కొత్త మ్యాటర్స్.. అవేనండీ అప్డేట్స్.. ఎప్పుడు వస్తాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అదే సమయంలో అల్లు అర్జున్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తనకు సినిమాలకు సంబంధించిన విషయాలు అఫీషియల్ ఛానల్ ద్వారా అనౌన్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిజానికి.. బన్నీ ప్రాజెక్టుల వివరాలను మేకర్స్ లేదా సెలబ్రిటీలు ఇప్పటి వరకు రివీల్ చేసేవారన్న విషయం తెలిసిందే.

అధికారికంగా లేదా అనధికారికంగా బన్నీ సినిమా విషయాలు బయటకు వచ్చేవి. ఇప్పుడు అల్లు అర్జున్ తరపున మాట్లాడే అధికారిక ప్రతినిధిని కలిగి ఉండే కల్చర్ ను ఆయన స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనే అల్లు అర్జున్ కాంపౌండ్ నుంచి రాబోయే ప్రాజెక్టుల వివరాలను వెల్లడించనున్నారట.

మార్చి నుంచి స్పోక్స్ పర్సన్ కల్చర్ ను బన్నీ స్టార్ట్ చేయనున్నారని సమాచారం. అయితే పుష్ప మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో వేరే లెవెల్ క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్.. తనకంటూ అన్ని విషయాల్లో స్పెషల్ మార్క్ క్రియేట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు స్పోక్స్ పర్సన్ కల్చర్ ను మొదలు పెట్టిన మొదటి హీరో అల్లు అర్జున్ కావచ్చని తెలుస్తోంది. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.