బన్నీ అరెస్ట్.. ఫస్ట్ గుర్తొచ్చింది ఆయన పిల్లలే: జానీ మాస్టర్
షూటింగ్ టైమ్ లో సెట్స్ కు వచ్చి తన ముందే అయాన్, అర్హ ఆడుకునేవారని చెప్పారు. అందుకే వాళ్లే ముందు తనకు గుర్తొచ్చారని జానీ మాస్టర్ తెలిపారు.
By: Tupaki Desk | 2 Jan 2025 6:30 AM GMTటాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్.. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయ్యి మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో కోసం దరఖాస్తు చేసుకున్నారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. మరి కొద్ది రోజుల్లో తుది తీర్పు ఇవ్వనుంది.
అయితే బన్నీ బెయిల్ పై జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చిన సమయంలో ఆయన కోసం ఇంటి ముందు వేచి ఉన్న అర్హ, అయాన్ విజువల్స్ ఎంతటి వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తమ తండ్రి ఇంటికి వచ్చాక ఇద్దరూ హగ్ చేసుకుని ఫుల్ ఖుషీ అయిపోయారు. బన్నీని చూశాక వారి ఆనందం ఓ రేంజ్ లో ఉందనే చెప్పాలి!
ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల కోసమే.. బన్నీ అరెస్ట్ అయిన వార్త వినగానే తాను ఆలోచించానని జానీ మాస్టర్ తెలిపారు. లైంగిక ఆరోపణల కేసులో కొన్ని రోజుల పాటు జైలులో ఉండి.. బెయిల్ పై బయటకు వచ్చిన జానీ.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వార్తపై రెస్పాండ్ అయ్యారు.
మన శత్రువులైనా సరే జైలును చూడకూడదని, జైలు ముఖం కూడా చూడకూడదని జానీ మాస్టర్ అన్నారు. బన్నీ అరెస్ట్ అయ్యాక వచ్చిన అనేక మీమ్స్ చూశానని, తాను హ్యాపీ అని చాలా మంది పెట్టారని తెలిపారు. కానీ నిజానికి ఆ వార్త విన్నప్పుడు ఫస్ట్ తనకు గుర్తొచ్చింది బన్నీ ఇద్దరు పిల్లలేనని చెప్పి జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు!
షూటింగ్ టైమ్ లో సెట్స్ కు వచ్చి తన ముందే అయాన్, అర్హ ఆడుకునేవారని చెప్పారు. అందుకే వాళ్లే ముందు తనకు గుర్తొచ్చారని జానీ మాస్టర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. జానీ మాస్టర్ చెప్పిందని నిజమేనని కామెంట్లు పెడుతున్నారు.
అయితే తన వద్ద చాలా కాలం పాటు పని చేసిన లేడీ కొరియోగ్రాఫర్ పెట్టిన లైంగిక ఆరోపణల కేసులో కొద్ది రోజుల క్రితం జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత నేషనల్ అవార్డు కోసం మూడు రోజుల బెయిల్ పై బయటకు వచ్చారు. కానీ అవార్డు రద్దైంది. రీసెంట్ గా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పుడు అటు ఫ్యామిలీతో గడుపుతూ.. ఇటు కెరీర్ పై ఫోకస్ చేస్తున్నారు.