అల్లు అర్జున్, అట్లీ కాంబోలో మరో హీరో?
పాన్ ఇండియా మార్కెట్ లో అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 6 March 2025 11:25 AM ISTపాన్ ఇండియా మార్కెట్ లో అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. ‘పుష్ప 2’తో 1800 కోట్ల భారీ వసూళ్లు అందుకున్న బన్నీ, తన నెక్ట్స్ లెవెల్ కెరీర్ ప్లాన్ లో భాగంగా అట్లీ దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. తొలుత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఉండాల్సి ఉన్నప్పటికీ, ఆ ప్రాజెక్ట్ కాస్త వెనక్కి వెళ్లి, అట్లీ కథకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
ఈ కథ అసలు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కోసం సిద్ధం చేశారని, కానీ బడ్జెట్ పరిమితులు, ఇతర కారణాలతో సినిమా ముందుకు సాగకపోవడంతో, అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ తీసుకున్నారని కోలీవుడ్ వర్గాల్లో టాక్. ఇక ఇది ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కథలో మరో కీలక పాత్ర కూడా ఉంటుందని, ఆ పాత్రకు కోలీవుడ్ నుంచి ఓ పెద్ద హీరోని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
లేటెస్ట్ గా, శివకార్తికేయన్ పేరు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ‘పరశక్తి’ చిత్రంతో బిజీగా ఉన్న ఈ హీరో, మే లోపు తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయమని కోరినట్టు సమాచారం. దీనికి కారణం, అట్లీ ప్రాజెక్ట్ లో బన్నీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం కావొచ్చని టాక్. ఇప్పటికే శివకార్తికేయన్, కోలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈ సినిమా వాస్తవంగా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తుండటంతో, అతని పాత్ర కూడా బలంగా డిజైన్ చేసినట్లు అర్థమవుతోంది. అల్లు అర్జున్, శివకార్తికేయన్ లాంటి ఇద్దరు డిఫరెంట్ స్టైల్ యాక్టర్స్ ఓ పవర్‌ఫుల్ యాక్షన్ మూవీలో కలిసి వస్తే.. అది ప్రేక్షకులకు మాంచి ట్రీట్ అవ్వడం ఖాయం. మాస్ ఫాలోయింగ్, కామెడీ టైమింగ్ కలిగిన శివకార్తికేయన్ లాంటి స్టార్.. బన్నీ లాంటి పాన్ ఇండియా హీరోతో కలిసి నటిస్తే, ఇది తెలుగు, తమిళ భాషల్లో ఓ సెన్సేషన్ మూవీ అవుతుందని ఇండస్ట్రీలో అంచనాలు మొదలయ్యాయి.
ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించే అవకాశం ఉంది. ఇక సినిమాకు అనిరుధ్ రవిచందర్ లేదా సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నారని సమాచారం. ఇప్పటికే జవాన్ సినిమాతో అట్లీ బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక టాలీవుడ్‌లో బన్నీతో కలిసి మరింత బిగ్గర్ ప్రాజెక్ట్ తీయాలని, బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి అట్లీ సినిమా అధికారిక అనౌన్స్ మెంట్, బన్నీ లుక్, క్యాస్ట్ పై ఉంది. మరి, శివకార్తికేయన్ పేరు ప్రచారంలోకి వచ్చినట్టు నిజమేనా లేక మరొకరు కీలక పాత్రలో కనబడతారా అన్నది త్వరలోనే తెలిసిపోనుంది.