ఆల్ ది బెస్ట్ చెప్పి ఆ హీరో సైడైపోయాడా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అట్లీ ప్రాజెక్ట్ దాదాపు లాక్ అయినట్లే. ముందుగా ఈ సినిమానే పట్టాలె క్కుతుందని సమాచారం.
By: Tupaki Desk | 7 March 2025 12:02 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అట్లీ ప్రాజెక్ట్ దాదాపు లాక్ అయినట్లే. ముందుగా ఈ సినిమానే పట్టాలె క్కుతుందని సమాచారం. రెగ్యులర్ షూటింగ్ సమ్మర్ తర్వాత మొదలవుతుందా? వేసవి తో సంబంధం లేకుండా సెట్స్ కి వెళ్తారా? అన్నది చూడాలి. అయితే బన్నీతో అట్లీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని అప్పట్లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇదే స్టోరీని అట్లీ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో తీస్తున్నాడనే ప్రచారం జరిగింది.
ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం ప్రయత్నిస్తున్నారని..కానీ ఆయన డేట్లు కుదడం లేదని, ఈ క్రమంలో సల్మాన్ పై భారీ బడ్జెట్ పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదని అందుకే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. అయితే రెండు రోజుల క్రితమే అట్లీ ముంబైలో ని సల్మాన్ ఖాన్ ని నేరుగా కలిసి క్షమాపణలు తెలియజేసాడుట.
వచ్చే ఏడాది ఇద్దరం కలిసి సినిమా చేద్దామని అట్లీ చెప్పాడుట. దీంతో సల్మాన్ ఖాన్ ఆ విషయాన్ని అంతే పాజిటివ్ గా తీసుకుని అట్లీతో సరదాగా మాట్లాడారుట. బన్నీసినిమాకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పినట్లు సమాచారం. దీంతో బన్నీ-అట్లీ సినిమా కన్పమ్ అయింది అనడానికి ఇదో రకమైన ఆధారం. బన్నీ తదుపరి సినిమా విషయంలో క్లారిటీ ఈ నెలాఖరుకల్లా వచ్చేస్తుందని బన్నీ వాస్ చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా కోసమే బన్నీ స్పెషల్ ట్రైనింగ్ కూడా ముగించుకుని వచ్చాడని ఇప్పటికే మీడియాలో వార్త లొస్తున్నాయి. అయితే బన్నీ- సల్మాన్ తో తీయాలనుకున్నది ఒకే సబ్జెక్టా? అది వేరు? ఇది వేరా? అన్నది కూడా తెలియాలి. ఈ కాంబినేషన్ లో సినిమా అనే ప్రచారంతోనే అంచనాలు ఒక్కసారిగా పీక్స్ కి చేరిన సంగతి తెలిసిందే. ఇద్దరు పాన్ ఇండియాలో సంచలనాలు నమోదు చేసిన వాళ్లే.