Begin typing your search above and press return to search.

బన్నీ నెక్స్ట్ ఆయనతోనే! బడా ప్రొడక్షన్ హౌస్ నిర్మాణంలో..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 Sep 2024 9:37 AM GMT
బన్నీ నెక్స్ట్ ఆయనతోనే! బడా ప్రొడక్షన్ హౌస్ నిర్మాణంలో..
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఓ వైపు షూటింగ్.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను మేకర్స్ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టనున్నారని సమాచారం. ఆ తర్వాత ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచనున్నారు.

అయితే దాదాపు మూడేళ్లుగా పుష్ప-2కే డేట్స్ కేటాయించారు అల్లు అర్జున్. మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. పలు రూమర్లు వినిపిస్తున్నా.. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. మరి అల్లు అర్జున్ నెక్స్ట్ ఏంటి? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ మధ్య కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో బన్నీ వర్క్ చేయనున్నారని జోరుగా ప్రచారం సాగింది. అంతా సెట్ అయిందని.. అనౌన్స్మెంట్ కూడా వచ్చేయనుందని టాక్ వినిపించింది.

ఇంతలో కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు రద్దు అయిపోయిందని, అట్లీ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో సినిమా చేయనున్నారని రీసెంట్ గా వార్తలు వచ్చాయి. అల్లు అర్జున్.. త్రివిక్రమ్ తో వర్క్ చేయనున్నారని టాక్ వినిపించింది. ఇప్పుడు మళ్లీ అట్లీ, బన్నీ ప్రాజెక్టు దాదాపు ఫిక్స్ అయిపోయిందని ఇండస్ట్రీలో వినికిడి. మరికొద్ది రోజుల్లో.. పుష్ప-2 రిలీజ్ కు ముందే అధికారికంగా కూడా ప్రకటించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అల్లు అర్జున్- అట్లీ కాంబోలో రానున్న సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయని సమాచారం. అయితే ఇప్పటికే బన్నీతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఓ మూవీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా నిర్మాణంలో కూడా టీ-సిరీస్ భాగం కానుంది. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి మరికొన్ని ఏళ్ల సమయం కచ్చితంగా పడుతుంది. స్పిరిట్ అయ్యాక సందీప్ స్టార్ట్ చేయనున్నారు.

కాగా, షారుక్ ఖాన్ జవాన్ తో పాన్ ఇండియా లెవెల్ లో అందరి దృష్టిని ఆకర్షించారు అట్లీ. బాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నారు. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఆ మూవీతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. మరోవైపు, పుష్పతో బన్నీ వేరే లెవెల్ లో ఫేమస్ అయ్యారు. దీంతో ఆయన నెక్స్ట్ సినిమాలపై అందరి ఫోకస్ పడింది. మరి బన్నీ, అట్లీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.