బన్నీ-అట్లీ ఉగాదికి ఫిక్సైపోయారా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ లాక్ అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 March 2025 1:15 AM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ లాక్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టోరీ లాక్ అయింది. అయినా స్క్రిప్ట్ కి సంబంధించి మరింత మెరుగ్గా అట్లీ టీమ్ పనిచేస్తోంది. అందుకు దుబాయ్ వేదిక అయిన సంగతి తెలిసిందే. సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా దుబాయ్ లోనే జరుగుతోంది. ఓ ఖరీదైన హోటల్ లో ఈ పనులు జరుగుతున్నాయి.
దానికి సంబంధించిన పనుల్లో బన్నీ కూడా జాయిన్ అవుతున్నాడు. ఎప్పటికప్పుడు దుబాయ్ టూ హైదరాబాద్ తిరుగుతున్నాడు. అయితే ఆయన ఈ సినిమా కోసం ఇలా తిరగడం చూసి? ఎందుకిలా తిరుగుతున్నాడు? అన్న సందేహం చాలా మందిలో ఉన్న నేపథ్యంలో నిర్మాత బన్నీ వాస్ ఆమద్య ఓ రీజన్ కూడా చెప్పారు. సినిమా పూర్తయిన తర్వాత స్పెషల్ ట్రైనింగ్ ల కోసం విదేశాలకు వెళ్తుంటారని....ఖాళీగా కూర్చోరని అన్నారు.
అయితే అట్లీ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనుల్లోనే బిజీ అయ్యాడు? అన్నది మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు. ఆ తర్వాత దుబాయ్ సంగతి బయటకు రావడంతో అభిమానులకు విషయం అర్దమైంది. అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎప్పటికి పూర్తవుతుంది? అన్నది క్లారిటీ లేదు. కొన్ని రోజుల్లోనే మొత్తం క్లారిటీ వస్తుందని బన్నీ వాస్ అన్నాడు. అదే నిజమైతే ఈ చిత్రాన్ని కూడా ఉగాది సందర్భంగా ప్రారంభించే అవకాశం ఉంటుంది.
కొత్త సినిమాల ప్రారంభోత్సవానికి ఉగాది ఎలాగూ మంచి పర్వదినం. ఆ రోజున చాలా కొత్త సినిమాలు లాంచ్ అవుతుంటాయి. కాబట్టి అట్లీ-బన్నీ ప్రాజెక్ట్ కూడా ఉగాదికి లాంచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ పేరు వినిపిస్తుంది. సంగీత దర్శకుడిగా అనిరుద్ పనిచేసే అవకాశం ఉంది.