నేషనల్ అవార్డు వెనుక బన్నీ బిగ్ స్కెచ్
ఫస్ట్ ఆయనకి ఒకటే మాట చెప్పాను. ఈ సినిమాతో నాకు నేషనల్ అవార్డు రావాలి. అది నీ చేతుల్లోనే ఉంది అని అన్నాను. ఇప్పటి వరకు మా మధ్య ఈ డిస్కషన్ జరిగిందని ఎవ్వరికి రివీల్ చేయలేదు.
By: Tupaki Desk | 15 Nov 2024 4:50 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. అలాగే ఈ సినిమాలో తన నటనకి గాను అల్లు అర్జున్ నేషనల్ అవార్డు సైతం అందుకున్నాడు. బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న మొట్టమొదటి తెలుగు హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ సందర్భంగా ఈ అవార్డు వెనుక ఉన్న ఇంటరెస్టింగ్ విషయాన్ని అల్లు అర్జున్ అన్ స్టాపబుల్ సీజన్ 4 షోలో రివీల్ చేశారు.
'పుష్ప' సినిమాకి నేషనల్ అవార్డు అందుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అయితే అంతకంటే ముందు మన తెలుగు వారిలో ఎవరికైనా నేషనల్ అవార్డు వచ్చిందా అని చూసాను. మూడు జెనరేషన్స్ లో ఇప్పటి వరకు ఎవ్వరికి రాలేదు. నాకు బాధ అనిపించింది. అప్పుడే నేషనల్ అవార్డు కొట్టాలని ఫిక్స్ అయ్యాను. టార్గెట్ పెట్టుకున్నాను. ఇక సుకుమార్ గారు 'పుష్ప' సినిమా కథ చెప్పినపుడు కమర్షియల్ సక్సెస్ గురించి నేను ఆలోచించలేదు.
ఫస్ట్ ఆయనకి ఒకటే మాట చెప్పాను. ఈ సినిమాతో నాకు నేషనల్ అవార్డు రావాలి. అది నీ చేతుల్లోనే ఉంది అని అన్నాను. ఇప్పటి వరకు మా మధ్య ఈ డిస్కషన్ జరిగిందని ఎవ్వరికి రివీల్ చేయలేదు. అలాగే షూటింగ్ జరుగుతున్న టైంలో సుకుమార్ గారు ప్రతి షాట్ తర్వాత ఒకసారి చూసేవారు. నేషనల్ అవార్డు రావాలంటే ఈ పెర్ఫార్మెన్స్ సరిపోదు అంటూ అలెర్ట్ చేసేవారు. సినిమా జరుగుతున్నంత కాలం నేషనల్ అవార్డు గురించి ఫోకస్ పెట్టి పని చేసాను.
ఫైనల్ గా అనుకున్నట్లు వచ్చింది. ఈ విషయం నేను ఎక్కడా కూడా ఇప్పటి వరకు చెప్పలేదు. ప్రేక్షకులు అందరూ ఇష్టపడే సినిమానే కమర్షియల్ మూవీ. అలాంటి సినిమాకి గుర్తింపు రావాలని అనుకున్నాను. 'పుష్ప'తో ఆ గుర్తింపు వచ్చింది. ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదు. నా నేషనల్ అవార్డుని మన తెలుగు హీరోలు అందరికి డేడికేట్ చేస్తున్నాను అని బన్నీ అన్నారు.
అది నేను కొట్టడం కాదు. తెలుగు హీరోలు అందరి తరపున నాకొచ్చిందని ఫీల్ అవుతున్నాను అంటూ నేషనల్ అవార్డు మూమెంట్ ని బాలయ్యతో బన్నీ పంచుకున్నారు. బాలయ్య కూడా ఈ సందర్భంగా అల్లు అర్జున్ కి హగ్ ఇచ్చి అభినందించారు. అలాగే ఈ సినిమాతో నేను ఎక్స్ పెక్ట్ చేయని విధంగా పాన్ ఇండియా మార్కెట్ కూడా ఓపెన్ కావడం చాలా సంతోషంగా ఉందని బన్నీ అన్నారు.