Begin typing your search above and press return to search.

బన్నీ లాంగ్ బ్రేక్.. ఎందుకంటే..?

అల్లు అర్జున్ పుష్ప 2 సాధించిన సక్సెస్ కన్నా ఈ ఇష్యూ పై తన మీద వచ్చిన అలిగేషన్స్ ఎక్కువ అని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   9 Jan 2025 4:09 AM GMT
బన్నీ లాంగ్ బ్రేక్.. ఎందుకంటే..?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తో పాన్ ఇండియా బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఐతే ఆ సినిమా ఆ రేంజ్ సక్సెస్ అందుకున్నా కూడా అల్లు అర్జున్ అంతగా హ్యాపీగా లేడు. ఎందుకంటే పుష్ప 2 ప్రీమియర్ షో వల్ల జరిగిన ఘటన వల్ల అల్లు అర్జున్ పూర్తిగా అప్సెట్ లో ఉన్నాడు. థియేటర్ లో మహిళ మృతి యాక్సిడెంటల్ గా జరిగినా దానికి ప్రధాన కారణం అంటే మాత్రం అన్ని వేళ్లు అల్లు అర్జున్ వైపే చూపిస్తున్నాయి. అందుకే ప్రభుత్వం, పోలీసులు అల్లు అర్జున్ ని ఈ విషయంలో బాగానే విచారణ జరిపారు. ఈమధ్యనే రెగ్యులర్ బెయిల్ రావడంతో కాస్త రిలాక్స్ అయ్యాడు అల్లు అర్జున్.

పుష్ప 2 ప్రీమియర్స్ అంటే డిసెంబర్ 4 నుంచి బెయిల్ వచ్చే వరకు అల్లు అర్జున్ సైడ్ నుంచి చూస్తే అసలేం జరుగుతుంది అన్నది అర్థం కానట్టే అని చెప్పొచ్చు. జరిగిన పొరపాటు ఒక ప్రాణాన్ని తీసింది అన్న రెగ్రెట్ ఎప్పటికీ ఉంటుంది. కానీ దాన్ని దాటి ముందుకు వెళ్లాల్సిందే. అల్లు అర్జున్ పుష్ప 2 సాధించిన సక్సెస్ కన్నా ఈ ఇష్యూ పై తన మీద వచ్చిన అలిగేషన్స్ ఎక్కువ అని చెప్పొచ్చు. అవి అతని మీద బాగా ఎఫెక్ట్ అయ్యేలా చేశాయి.

అందుకే అల్లు అర్జున్ ఒక ఆరు నెలలు ప్రపంచానికి దూరంగా ఉండాలని అనుకుంటున్నారట. అసలైతే పుష్ప 2 సక్సెస్ జోష్ లోనే త్రివిక్రమ్ సినిమా కూడా వెంటనే మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఆరు నెలలు అసలు ఎవరికీ కనిపించకూడదని ఫిక్స్ అయ్యాడట. కంప్లీట్ గా ఈ ఆరు నెలలు ఫ్యామిలీతోనే గడిపేలా షెడ్యూల్ చేసుకుంటున్నారట. ఆ తర్వాత వచ్చి నెక్స్ట్ సినిమా మొదలు పెడతారని తెలుస్తుంది.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ మీద రానటువంటి కొత్త కాన్సెప్ట్ తో వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం బడ్జెట్ కూడా భారీగా పెట్టేస్తున్నారట. ప్రస్తుతం త్రివిక్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందని తెలుస్తుంది. ఐతే త్రివిక్రమ్ పనులు మొదలు పెట్టినా కూడా అల్లు అర్జున్ మాత్రం ఆరు నెలల తర్వాతే టైం ఇస్తాడని తెలుస్తుంది. అల్లు అర్జున్ కి ఈ టైం లో ఈ గ్యాప్ చాలా అవసరమని ఆయన ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు.