గోవా వైన్ షాప్.. వాడి కోసమే వెళ్ళాను: అల్లు అర్జున్
అల్లు అర్జున్ క్యాజువల్ డ్రెస్ లో వైన్ షాప్ కి వెళ్లిన సీసీ ఫుటేజ్ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 15 Nov 2024 4:49 AM GMTఅల్లు అర్జున్ క్యాజువల్ డ్రెస్ లో వైన్ షాప్ కి వెళ్లిన సీసీ ఫుటేజ్ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై భిన్నమైన కామెంట్స్ వినిపించాయి. అయితే బాలయ్య ‘అన్ స్టాపబుల్ సీజన్ 4’ లో అల్లు అర్జున్ ఈ వీడియో బ్యాక్ స్టోరీని రివీల్ చేశారు. గోవాలో వెళ్ళినపుడు ఇది జరిగిందని చెప్పారు. సందీప్ అని నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు సర్… గోవాలో ‘నా పేరు సూర్య’ షూటింగ్ టైంలో అతనికి ఫోన్ చేసి ఎం తీసుకొనిరావలని అడిగాను.
వాడు ఏదో వైన్ బాటిల్ పేరు చెప్పాడు. నేను కారులో ఉండి డ్రైవర్ ని పంపిస్తే అతను కమ్యూనికేషన్ ప్రాబ్లెమ్ వలన సరిగా చెప్పలేకపోతున్నారు. ఇంకెందుకని నేనే దిగేసి వెళ్లి అడిగాను. వైన్ షాపు వారు లేదని చెప్పడంతో తిరిగి వచ్చేసాను. ఆ వీడియోనే వైరల్ అయ్యింది. అతను మీ హార్డ్ కొర్ ఫ్యాన్ సర్ అని బాలయ్యతో బన్నీ చెప్పారు. వాడిది విజయవాడ, వాడి చెయ్యి కోసిన పసుపు బ్లడ్ వస్తుంది. అంత అభిమానం మీరంటే అంటూ బన్నీ తన ఫ్రెండ్ ని తీసుకొచ్చాడు.
ఎప్పటి నుంచో మిమ్మల్ని కలిపించమని అడుగుతున్నాడు. అందుకే తీసుకొచ్చానని తన ఫ్రెండ్ సందీప్ ని అల్లు అర్జున్ బాలయ్యకి పరిచయం చేశారు. ఈ సందర్భంగా గోవా వైన్ షాప్ ఇన్సిడెంట్ గురించి సరదాగా మాట్లాడుకున్నారు. అయినా నేనంటే సెలబ్రెటీని, ఆ విషయం మరిచిపోయి ఏదో తీసుకొస్తానని అడిగాను. వీడైనా వద్దని చెప్పాలి కదా సర్. వాడు కూడా చెప్పలేదు. నేను సెలబ్రెటీని అనే విషయాన్ని మరిచిపోయి అలా క్యాజువల్ గా వెళ్ళిపోయాను అంటూ బన్నీ చెప్పాడు. సందీప్ కూడా బన్నీని నేను హీరో అని ఆలోచనతో చూడలేదు.
ఒక ఫ్రెండ్ గానే చూసి చెప్పానని సందీప్ ఈ సందర్భంగా షోలో బాలయ్యతో అన్నారు. చిన్నప్పుడు చేసిన ఏదైనా అల్లరి పని చెప్పాలని బాలయ్య సందీప్ ని అడిగారు. చిన్న వయస్సులో మనీ మేకింగ్ మిషన్ దొరుకుతుందని ఎవరో చెబితే అది కొనాలని డిసైడ్ అయ్యాము. అయితే మా ఇద్దరి దగ్గర డబ్బులు లేవు. దీంతో బన్నీ తన బుక్స్, బాక్స్ అన్ని అమ్మేశాడు.
ఆ డబ్బులు పట్టుకొని మనీ మేకింగ్ మిషన్ కొనాలని అన్ని షాపులు తిరిగాము. ఎక్కడా దొరకలేదు. ఫైనల్ గా ఆ డబ్బులతో స్నాక్స్ కొనుక్కొని తినేశాము. సాయంత్రం ఇంటికి వెళ్లే సమయానికి బన్నీ దగ్గర బుక్స్ లేవు. ఎలా వెళ్లాలని భయ పడ్డాం అంటూ సందీప్ బన్నీ గురించి చెప్పాడు. ఆ రోజు నుంచి బన్నీ నాకు అన్నీ ఇస్తూనే ఉన్నాడు అంటూ చెప్పాడు. సందీప్ నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ బన్నీ కూడా ఈ సందర్భంగా చెప్పారు.