Begin typing your search above and press return to search.

'మెగా' మావయ్యతో అల్లరి 'అల్లు'డు.. వైరల్ ఫోటో వెనకున్న అసలు స్టోరీ ఇదే!

ఉన్నట్టుండి ఇప్పుడు సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లకు సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతోంది.

By:  Tupaki Desk   |   9 Dec 2024 10:30 AM GMT
మెగా మావయ్యతో అల్లరి అల్లుడు.. వైరల్ ఫోటో వెనకున్న అసలు స్టోరీ ఇదే!
X

ఉన్నట్టుండి ఇప్పుడు సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లకు సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఇందులో బన్నీకి చిరు స్వీట్ తినిపిస్తుండగా.. పక్కనే చిరంజీవి సతీమణి సురేఖ కూడా నిలబడి చూస్తున్నారు. మెగా అల్లు బంధాన్ని చూసించే ఈ పిక్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో మామా అల్లుళ్ళు ఎప్పుడు కలిశారు? 'పుష్ప 2' సక్సెస్ తర్వాత మెగా దంపతులను అల్లు అర్జున్ మీట్ అయ్యారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.


నిజానికి నెట్టింట చక్కర్లు కొడుతున్న చిరు - బన్నీల పోటో ఇప్పటిది కాదు. 'పుష్ప: ది రైజ్' సినిమాకి గాను అల్లు అర్జున్ నేషనల్ ఫిలిం అవార్డ్ సాధించినప్పటి ఫోటో అది. బెస్ట్ యాక్టర్ గా జాతీయ పురస్కారాన్ని అందుకున్న తొలి తెలుగు హీరోగా నిలిచినందుకు, చిరంజీవి తన భార్యతో కలిసి వెళ్ళి బన్నీని అభినందించారు. అయితే 'పుష్ప 2: ది రూల్' సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న తరుణంలో ఈ ఓల్డ్ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మధ్య గొడవలు పెరిగిపోయాయనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా బన్నీ నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు ప్రకటించినప్పటి నుండి ఇరు వర్గాల అభిమానుల మధ్య దూరం మరింత పెరిగింది. 'పుష్ప 2' సినిమా గురించి మెగా కంపౌండ్ నుంచి ఎలాంటి పోస్టులు లేకపోవడంతో, మెగా-అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం ఎక్కువైంది. ఇలాంటి టైంలో బన్నీ వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.

రీసెంట్ గా జరిగిన 'పుష్ప 2' మూవీ సక్సెస్ మీట్ లో, టికెట్ రేట్లు పెంచుకోడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున చొరవ తీసుకున్నందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు అల్లు అర్జున్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా 'కల్యాణ్ బాబాయ్' అని సంబోధించి ఆయన మీదున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు. దీంతో మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఆగిపోయాయి. ఇందులో భాగంగా 'పుష్ప 2' సినిమాకి తమ సపోర్ట్ తెలిపే క్రమంలోనే చిరంజీవి - అల్లు అర్జున్ ల ఫోటోని మెగా అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఏదేమైనా చిరు - బన్నీల ఫోటో చూసి 'మెగా' ముద్దుల మావయ్యతో అల్లరి 'అల్లు'డు అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజంగానే మామా అల్లుళ్లు కలిసే సందర్భం వస్తే మరోసారి సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయమని భావిస్తున్నారు. ప్రస్తుతం చిరు ఏదో పని మీద సింగపూర్‌లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి తిరిగి వచ్చిన తర్వాత 'పుష్ప 2' సినిమా చూసి బన్నీ ని అభినందిస్తారేమో చూడాలి. మరోవైపు అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ జోష్ లో ఉన్నారు. తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.