రైజ్..రూల్ తర్వాత 'పుష్ప-3' ర్యాంపేజ్!
రెండవ భాగంతో ఏకంగా 'బాహుబలి' రికార్డులే చెరిగిపోయాయి. దీంతో 'పుష్ప3' కూడా ఉంటుందని ప్రకటించారు. రెండు భాగాల నుంచి కొన్ని లీడ్స్ కూడా ఇచ్చారు.
By: Tupaki Desk | 10 Feb 2025 8:06 AM GMT'పుష్ప' ప్రాంచైజీతో అల్లు అర్జున్ -సుకుమార్ పాన్ ఇండియాలో ఓ బ్రాండ్ గా మారిన సంగతి తెలిసిందే. 'పుష్ప' ది రైజ్... 'పుష్ప ది రూల్' అటూ ఇద్దరు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నికావు. రెండు భాగాలు కలిపి బాక్సాఫీస్ వద్ద 2200 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. రెండవ భాగంతో ఏకంగా 'బాహుబలి' రికార్డులే చెరిగిపోయాయి. దీంతో 'పుష్ప3' కూడా ఉంటుందని ప్రకటించారు. రెండు భాగాల నుంచి కొన్ని లీడ్స్ కూడా ఇచ్చారు.
అయితే మూడవ భాగం ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు పట్టాలెక్కుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అసలు ఉందా? లేదా? అన్నది కూడా ఇప్పుడే చెప్పలేం. ఈ విషయం ఇటీవల పుష్ప ఈవెంట్లో బన్నీ మాటల్ని బట్టి క్లారిటీ వచ్చేసింది. `పుష్ప3` ప్రకటించాం. కానీ అది ఎప్పుడు ? ఆ భాగం కథ ఏంటి? అన్నది నాకు తెలియదు...ఎదురుగా ఉన్న సుకుమార్ కి తెలియదంటూ ఓపెన్ అయ్యాడు బన్నీ. దీన్ని బట్టి పార్ట్ 3 ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు.
'పుష్ప3' మొదలు పెట్టాలంటే? రెండు భాగాల్నిమించి బలమైన కథ కావాలి. అంది పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ నే షేక్ చేసే కంటెంట్ అయి ఉండాలి. ఎర్ర చందనం స్మగ్లింగ్ బిజినెస్ అన్నది విదేశాల్లో ఎలా జరుగు తుందో చూపించాలి. కొత్తగా ఇండియా మార్కెట్ చుట్టూనో .తిరుపతి అడవుల చుట్టూనో చూపిస్తే సరిపోదు. పూర్తి కొత్త కథ, నేపథ్యం కావాలి. అప్పుడే ప్రేక్షకుడికి కొత్త ఫీల్ కలుగుతుంది. కానీ అది ఇప్పట్లో జరిగేది కాదు.
ప్రస్తుతం ఎవరి ప్రాజెక్ట్ లతో వారు బిజీగా ఉన్నారు. బన్నీ హీరోగా త్రివిక్రమ్ తో ఓ పాన్ ఇండియా సినిమా తీస్తున్నా డు.అలాగే సుకుమార్..రామ్ చరణ్ తో తెరకెక్కించాల్సిన సినిమాల్లో పనుల్లో తలమునకలై ఉన్నారు. బన్నీ-సుకుమార్ ముందుగా ఈ రెండు సినిమాలు పూర్తి చేసి రిలీజ్ చేయాలి. అందుకు రెండేళ్లు అయినా సమయం పడుతుంది. ఆ తర్వాత కొత్త ప్రాజెక్ట్ గురించి ఆలోచించగలిగేది.