Begin typing your search above and press return to search.

దేవర కథ.. ఫస్ట్ అనుకున్న హీరో అతనేనా?

అయితే అల్లు అర్జున్ రిలీజ్ చేసిన పోస్టర్ బట్టి దేవర కథతోనే బన్నీ, కొరటాల కాంబోలో సినిమా కన్ఫర్మ్ అయ్యిందనే ప్రచారం నడుస్తోంది.

By:  Tupaki Desk   |   11 Sep 2024 3:48 AM GMT
దేవర కథ.. ఫస్ట్ అనుకున్న హీరో అతనేనా?
X

దేవర మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యి వ్యూవ్స్ పరంగా యుట్యూబ్ లో దూసుకుపోతోంది. అన్ని భాషలలో ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఆర్ఆర్ఆర్ రేంజ్ లో కాకపోయిన దేవర ట్రైలర్ ప్రెజెంటేషన్ బాగుందనే అభిప్రాయం చాలా మంది నుంచి వ్యక్తం అవుతోంది. కొంతమంది మాత్రం యావరేజ్ అంటున్నారు. ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ తో దేవర మూవీపైన అంచనాలు పెరుగుతాయని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇదిలా ఉంటే దేవర మూవీ కథ గురించి సోషల్ మీడియాలో ఇప్పుడో ఇంటరెస్టింగ్ టాక్ నడుస్తోంది. గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొరటాల శివ దర్శకత్వంలో AA21 చిత్రాన్ని ఎనౌన్స్ చేశారు. యువసుధా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తాయని ఒక ప్రీలుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి అల్లు అర్జున్ స్వయంగా కన్ఫర్మ్ చేశారు. 2020లో ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ప్రకటన వచ్చింది.

సుకుమార్ తో పుష్ప మూవీ షూటింగ్ దశలో ఉండగా కొరటాలతో సినిమాని అల్లు అర్జున్ ఎనౌన్స్ చేశారు. కొరటాల శివ మెగాస్టార్ తో చేసిన ఆచార్య మూవీ 2022లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. తరువాత అల్లు అర్జున్ తో అనుకున్న ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. నెక్స్ట్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇద్దరి కాంబినేషన్ లో దేవర మూవీ తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

అయితే అల్లు అర్జున్ రిలీజ్ చేసిన పోస్టర్ బట్టి దేవర కథతోనే బన్నీ, కొరటాల కాంబోలో సినిమా కన్ఫర్మ్ అయ్యిందనే ప్రచారం నడుస్తోంది. అల్లు అర్జున్ బిజీగా ఉండటం వలనో ఏమో గాని అప్పట్లో కొరటాలతో అనుకున్న ప్రాజెక్ట్ అయితే సెట్ అవ్వలేదు. అప్పటి థీమ్ పోస్టర్, దేవర ట్రైలర్ కి చాలా దగ్గరగా ఉందనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

అల్లు అర్జున్ తో అనుకున్న కథనే ఎన్టీఆర్ తో దేవరగా కొరటాల చేశాడా లేదా అనేది తెలియాలంటే అతను క్లారిటీ ఇవ్వాల్సిందనే మాట వినిపిస్తోంది. దేవర మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతోంది. దేవర మూవీ రిజల్ట్ బట్టి అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ వదులుకున్న నిర్ణయం సరైందా కదా అనేది తెలిసే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే దేవర మూవీపైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని అర్ధమవుతుంది.